నెయిల్ పాలిష్ డ్రైయ్యర్ ల్యాంప్స్‌తో క్యాన్సర్.. నిర్ధారించిన శాస్త్రవేత్తలు

by Disha Web |
నెయిల్ పాలిష్ డ్రైయ్యర్ ల్యాంప్స్‌తో క్యాన్సర్.. నిర్ధారించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: జెల్ నెయిల్ పాలిష్ డ్రైయ్యర్ ల్యాంప్స్ ద్వారా క్యాన్సర్ సంక్రమిస్తుందని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. నెయిల్ సెలూన్స్‌లో విరివిగా యూజ్ చేసే ఈ యూవీ లైట్ స్పెక్ట్రమ్(340-395nm).. అనుకున్న దానికంటే ఎక్కువ హానికారకమని తెలిపారు. అసలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మార్కెట్ చేయబడే ఈ పరికరాలు.. పరమాణు, సెల్యులార్ స్థాయిలలో మానవ కణాలను ప్రభావితం చేస్తున్నాయని అధ్యయన రచయిత లుడ్మిల్ అలెగ్జాండ్రోవ్ వివరించారు.

లుడ్మిల్ అండ్ టీమ్.. 'మానవ చర్మం కెరాటినోసైట్లు, హ్యూమన్ ఫోర్‌స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌లు, మౌస్ ఎంబ్రియోనిక్ ఫైబ్రోబ్లాస్ట్‌లు' అని పిలువబడే మూడు సెల్ లైన్స్‌పై పరిశోధనలు జరిపారు. దీని ప్రకారం.. 20 నిమిషాల UV లైట్ ఎక్స్‌పోజర్ సెషన్.. 20 శాతం నుంచి 30 శాతం బహిర్గత కణాలను చంపింది. ఇలాంటి మూడు ఎక్స్‌పోజర్‌ల ఫలితంగా 65-70 శాతం చొప్పున సెల్ మరణానికి దారితీసింది. మిగిలిన కణాలు కూడా DNA దెబ్బతినడం, ఉత్పరివర్తనాలను ఎదుర్కొన్నాయి. ఇది వింతగా చర్మ క్యాన్సర్‌ను పోలి ఉందని తెలిపారు.

'మేము అనేక విషయాలను పరిశీలించాం. ముందుగా డీఎన్‌ఏ దెబ్బతింటుందని గుర్తించాం. కొన్నిసార్లు డీఎన్‌ఏ డ్యామేజ్ కాలక్రమేణా రిపేర్ చేయబడదని తెలుసుకున్నాం. ఇది UV-నెయిల్ పాలిష్ డ్రైయర్‌తో ప్రతి ఎక్స్‌‌పోజర్ తర్వాత ఉత్పరివర్తనాలకు దారితీస్తుంది. చివరగా మైటోకాండ్రియల్ పని చేయకపోవటానికి కారణమవుతుంది. ఇది అదనపు ఉత్పరివర్తనాలకు కూడా దారితీయవచ్చు. చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో రేడియేటెడ్ కణాలలో కనిపించే అదే విధమైన మ్యుటేషన్స్‌ వీరిలోనూ గమనించాం' అని తెలిపారు శాస్త్రవేత్తలు.


Next Story