కవలల దినోత్సవం.. ట్విన్స్ ఎలా పుడుతారో తెలుసా?

by Disha Web Desk 8 |
కవలల దినోత్సవం.. ట్విన్స్ ఎలా పుడుతారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కవల పిల్లలను చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకే రూపంతో ఇద్దరూ అపురూపంగా కనిపిస్తుంటారు. ఇక వీరి మాట, రూపు, కొన్ని కొన్ని చేష్టలు కూడా ఒకే విధంగా ఉంటాయి.ఇక ఒకే కాన్పులో ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలు అంటారు. చాలా మంది ఇద్దరికి జన్మనిస్తారు. కానీ వందలో ఇద్దరో ముగ్గురో మాత్రం ముగ్గురు లేదా నలుగురికి జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి.

ఇక కవల పిల్లలు అంటే తల్లి గర్భం నుంచి నిమిషాల వ్యవధిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మించడం. తల్లి, కవల పిల్లలు అంటే ఒకే కాన్పులో ఒక ఆడ లేదా మగకు జన్మనివ్వవచ్చు లేదా ఇద్దరు ఆడపిల్లలు, లేదా ఇద్దరు మగపిల్లలకు కూడా జన్మనివ్వవచ్చు. ఇక ఇలా కవలలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో సంతోషపడుతుంటారు.కవలలను పెంచడంలో ఆ తల్లికి సమస్యలు ఎదురైనా.. వారి అల్లరి చూస్తూ ఆనందంగా కవలలను కంటిపాపలా కాపాడుకుంటూ వస్తుంది. ఇద్దరికీ ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న డ్రెస్‌లు వేస్తూ, ఒకేరకమైన బొమ్మలు కొనిస్తూ వారిని చూసుకుంటూ మురిసిపోతుంది అమ్మ. కవలలుగా పుట్టిన వారిలో కూడా అనురాగం అప్యాయతలు ఇద్దరిలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కరికి కష్టం వచ్చినా మరొకరు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది.అలాంటి అందమై కవలల దినోత్సవం నేడు. దీన్ని మొదటగా 1976లో పొలెండ్‌లో జరుపుకున్నారు. పొలెండ్‌లో మోజస్. ఆరన్ విల్‌కాక్స అనే కవల సోదరులు మరణించిన రోజున ప్రపంచ కవలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న జరుపుకుంటున్నారు.

కవలలు ఎలా పుడతారంటే?

తల్లి కావడం అనేది ప్రతీ తల్లికి ఓ అపురూపమైన ఘట్టం. ఓ రూపానికి పురుడు పోయడానికి ఆ తల్లి ఎన్నో కష్టాలను ఇష్టంగా భరిస్తుంది. ఇక పురుషుల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే శుక్రకణాలు మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం వల్లనే పునరుత్పత్తి జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఒక్కోసారి మహిళల్లో రెండు అండాలు విడుదలై, శుక్రకణం రెండు అండాలతో ఒకే సారి ఫలదీకరణం చెందుతుంది. అంటువంటి సమయంలో కవలలు పుడుతారంట.


Next Story

Most Viewed