భారతదేశంలోని ఈ పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటే అంతే సంగతి

by Disha Web Desk 20 |
భారతదేశంలోని ఈ పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటే అంతే సంగతి
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశంలో పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. అందమైన ప్రకృతి, పచ్చటి అడవులు, కొండలు కోనలు, సెలయేర్లు, జలపాతాలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో సుందరమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలను చూడడానికి పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. సుందరమైన ప్రదేశాలను చూసి ఆనందిస్తారు. కానీ కొన్ని ప్రదేశాల గురించి గొప్పగా విన్నా ఆ ప్రాంతానికి మాత్రం చేరుకోలేము. ఆ ప్రాంతాలలో పర్యటించడాన్ని నిషేదించారు. ఇంతకి అంత అద్భుతమైన ప్రదేశాలెంటో ఇప్పుడు చూద్దాం.

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్..

కేరళ అంటేనే సుందరమైన ప్రదేశాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. అంతటి సుందరమైన ప్రదేశాలలో ఒక్కటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ ఉద్యానవనం మైమరపించే సహజ సౌందర్యంతో సందర్శకులను ఆకర్శిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి వేలాదిగా పర్యాటకులు వచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడి దీనికి కారణం.

చంబల్ నది..

మధ్యప్రదేశ్ లోని చంబల్ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నదీతీర ప్రాంతంలో ఉండే మనోహరమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు. అంతే కాదు చాలావారకు బాలీవుడ్ సినిమాలను చిత్రీకరించేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకునేవారు. దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి ఈ నది. ఈ నదీ ప్రాంతంలో బందిపోటు దొంగలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి సందర్శకులు రావడం తగ్గించారు.

మానస్ నేషనల్ పార్క్..

మానస్ నేషనల్ పార్క్ ఇది అస్సాంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. అంతే కాదు ఈ పార్క్‌ని దేశంలోని ఎంతో అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పిలుస్తారు. 2011లో బోడో ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆరుగురు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అధికారులను అపహరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి తగ్గింది.

బారెన్ ద్వీపం..

అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్ ద్వీపంలో నేటికీ నిప్పులు చెరిగే అగ్నిపర్వతం ఉంది. ఈ ప్రాంతం పెద్దగా ఉనికిలో లేకపోయినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే దట్టమైన పొగను, ఎర్రని లావాలను చూడాలనుకుంటే చిన్న షిప్‌లో భద్రతా ప్రమాణాలతో వెళ్లి పరిమిత దూరం నుంచి చూడవచ్చు. భద్రత లేకుండా నిప్పుడు చెరిగే ఈ పర్వతం దగ్గరికి వెల్లడానికి అనుమతులు నిషేధం.

అక్సాయ్ చిన్..

అక్సాయ్ చిన్ ఈ ప్రదేశాన్ని కూడా టూరిస్టులు చూసేందుకు వీలులేదట. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌గా పిలువబడే ఈ ప్రాంతం తూర్పు భాగంలో ఉంది. ఇది లడాఖ్‌లో ప్రవహించే పాంగోంగ్ ట్సో సరస్సు మీదుగా వెళ్తుంది. పర్వత శిఖరాల మధ్య ఉండే ఈ ప్రాంతం అందాల గురించి, ప్రకృతి సోయగాల గురించి వర్ణించలేనంతగా ఉంటాయి. ఈ ప్రాంతం ఎంత సుందరంగా ఉంటుందో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని కూడా అంటారు.

బస్తర్..

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో నిండింది. ఇక్కడి చిత్రకూట్ వంటి పర్యాటక ప్రదేశాన్ని ఇండియన్ నయాగరా జలపాతాలుగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మొగ్గుచూపరు.

నికోబార్ ద్వీపం..

అండమాన్ లో పర్యటించినట్టగా నికోబార్ దీవుల్లో పర్యాటకులు ప్రవేశించేందుకు ఛాన్స్ ఉండదు. ఇక గిరిజన సమూహాలు ఉండే ప్రాంతాల్లో అయితే అస్సలు అనుమతించరు. ప్రత్యేక పాస్‌లు ఉంటేనే పర్యాటకులు, విదేశీయులు ద్వీపంలో పర్యటించవచ్చు. అందమైన సముద్రపు అలలతో కూడిన బీచ్‌లు, దట్టమైన అడవులు చూపరులను ఆకర్షిస్తాయి. ఈ ద్వీపంలో వెల్లాలంటే కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed