విజయం సాధించాలంటే ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే!

by Disha Web Desk 8 |
విజయం సాధించాలంటే ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సక్సెస్ కావాలనుకుంటే ఎదురయ్యే సవాల్లను అధిగమించాలంటే. మన కెరీర్‌ను మనమే తీర్చిదిద్దుకోవాలి, అలాంటప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరి, ఉన్నతంగా ఉంటాం. అయితే విజయం అందుకోవాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతీ ఒక్కరు ఏదైనా పని చేయమంటే సాకులు వెతుకుతారు, లేదా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అప్పజెప్పితే దాన్ని చేయకుండా వేరే పని వలన ఇది చేయలేకపోయాను అంటూ సాకులు చెపుతుంటారు. అయితే విజయం అందుకోవాలి, జీవితంలో ఉన్నతస్థానంలో ఉండాలి అనుకునే వారు అలాంటి సాకులు చెప్పకూడదంట. చెప్పిన పనిని శ్రద్ధ పెట్టి చేయడమే కాకుండా దాని ద్వారా నువ్వు ఎంత నేర్చుకున్నావో నీకు నువ్వే తెలుసుకోవాలంట. అర్థం కానీ ఏ విషయాన్నైనా ఇతరులను అడగాలంట. నీకు అర్థంకాని పదాన్ని లేదా, విషయాన్ని ఇతరులను, నీ కంటె చిన్నవారిని అడగడానికి సంకోచిస్తే మనం సక్సెస్ కోసం చేసే పోరాటంలో ఓ మెట్టు వెనక్కు వెళ్లినట్లే అంటున్నారు నిపుణులు.

అలాగే,ప్రతి ఒక్కరు తమ కంటూ కొన్ని సరిహద్దులు నిర్దేశించుకోవాలి. ప్రతి విషయానికి అవును అని తల ఊపకూడదంట. చేయలేనివి, సాధ్యం కాని పనులకు లేదు, కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు తిరస్కరించడానికి కూడా ధైర్యం కావాలి. కాబట్టి నో చెప్పడం అలవర్చుకోవాలి.అదే విధంగా ఏ పనినైనా బాధ్యగా చేయడం నేర్చుకోవాలంట.



Next Story

Most Viewed