కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి

by Jakkula Samataha |
కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి
X

దిశ, ఫీచర్స్ : మన రోజు తినే ఆహారం ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ఈ రుచికరమైన వంటలు మరింత టేస్ట్ గా ఉండాలంటే మనం వండుకునే కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.అయితే కొత్తిమీర రోజు మనకు వంటలకు కొత్తిమీర అవసరం అవుతుంది.అయితే ఈ కొత్తి మీర ఒక్కో టైం లో ఒక్కో ధర ఉంటుంది.చలికాలంలో కొత్తమీర తక్కవ ధరకే లభిస్తుంది.కానీ వేసవిలో మాత్రం ధర భారీగా పెరుగుతుంది.అయితే ఈ కొత్తమీర ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే కష్టం ఎందుకంటే తోందరగానే వాడిపోతుంది.ఇక చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. ఫ్రిజ్ లో కొన్ని రోజులు తాజాగానే ఉన్నా.. మరికొంత కాలం ఉంచుకోవాలంటే అయితే వేసవిలో కొత్తిమీరను తాజాగా ఉంచడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

కొత్తిమీరను తాజాగా ఉంచడానికి దానిని నీటిలో నానబెట్టి ఉంచాలి.తర్వాత కొత్తిమీర ఆకులను కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత సగం గ్లాసు నీరు వేసి పచ్చి కొత్తిమీర వేయాలి.అలా వేశాక రోజూ నీళ్లను మారుస్తుండాలి. తర్వాత ఆ గ్లాసును ఫ్రిజ్‌లో పెట్టాలి.ఇలా చేసినా మూడు వారాల పాటు కొత్తిమీర తాజాగా ఉంటుంది.అయితే కొత్తిమీర మరింత తాజాగా ఉంచలంటే ప్లాస్టిక్‌ బాక్సులో ఉంచి దాని చుట్టూ క్లాత్‌ చుట్టిపెట్టినా తాజాగా రెండు వారాల పాటు ఉంటుంది. అలాగే కొత్తిమీరను క్లాంగ్‌ ఫిల్మ్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం పాటు పాడుకాకుండా ఉంటుంది.



Next Story

Most Viewed