నిద్రలో గురక వస్తుందా.. ఈ టిప్స్ పాటించండి !

by Disha Web Desk 8 |
నిద్రలో గురక వస్తుందా.. ఈ టిప్స్ పాటించండి !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య గురక. చాలా మంది నిద్రలో తమకు తెలియకుండానే, గురక పెడుతుంటారు. అయితే దీంతో పక్క వారు చాలా ఇబ్బంది పడుతారు. అయితే నిద్రిస్తున్న సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడుతాయంట.దీంతో ఆ సమయంలో నోటి నంచి శ్వాస తీసుకుంటారంట. అయితే ఈ గురక సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు వైద్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • రాత్రి నిద్రించడానికి ముదు మరిగే నీటిలో నాలుగు నుంచి ఐదు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలంట. దీని వలన గురక కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.

  • అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి నిద్రపోయే ముందు తాగితే గురక రాదంట.

  • ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే పిప్పరమెంట్ ఆయిల్ చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తే గురక తగ్గుతుంది అంటున్నారు వైద్యులు.

  • నిద్రపోయే ముందు మద్యం సేవించడం, ధూమపానం చేయడం, నిద్రమాత్రలు, ఇతర మందులు అస్సలే తీసుకోకూడదంట. ఈ తప్పుడు అలవాట్ల వల్ల మీ శరీరం అనేక ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు గురవుతుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరానికి తగినంత నిద్ర అవసరం. శరీరానికి సరిపడా నిద్ర ఇవ్వకపోయినా, ఎక్కువ నిద్రపోయినా, సోమరితనం చేసినా నిద్రలో గురక వస్తుందంట. అదువలన శరీరానికి సరిపడ నిద్ర పోవాలంట.

Next Story

Most Viewed