ఈ మూడు సమస్యలు ఉన్న వారు.. కాఫీ తాగకపోవడమే మంచిది..!

by Prasanna |
ఈ మూడు సమస్యలు ఉన్న వారు.. కాఫీ తాగకపోవడమే మంచిది..!
X

దిశ,వెబ్ డెస్క్: ఉదయం లేవగానే మనలో చాలా మంది కప్పు కాఫీ తాగనిదే రోజు స్టార్ట్‌ కాదు. బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. కాఫీ తాగుతుంటారు. కాఫీ మితంగా తీసుకుంటే.. టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని, డిప్రెషన్‌, ఒత్తిడి కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బరువు తగ్గడానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే, కాఫీని వీరు తాగకూడదని నిపుణులు వెల్లడించారు. ఏ సమస్యలు ఉన్న వారు కాఫీ తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం..

1. నిద్రలేమి సమస్యతో బాధపడే వ్యక్తులు.. కాఫీని పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో అధికంగా ఉండే కెఫిన్‌ మీ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు.. కాఫీ తాగితే, వారి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

2. జీర్ణక్రియ సమస్యలున్న వారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. మరీ తప్పదనుకుంటే రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి.

3. గర్భం ధరించిన మహిళలు.. పాలిచ్చే తల్లులు కాఫీ తాగకపోవడమే మేలని నిపుణులు తెలిపారు. ఒకవేళ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకుని తాగాలంటున్నారు.



Next Story

Most Viewed