- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రోబో.. గెలుపు ఆ పార్టీదేనా?

దిశ, ఫీచర్స్: ఒక పార్టీ అధికారంలోకి రావలంటే పార్టీ అధినేత వ్యూహరచనలు ఇంపార్టెంట్. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలను ఆకట్టుకుంటేనే.. ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ప్రభుత్వాన్ని నెలకొల్పే అదృష్టం దక్కుతుంది. ఇక్కడ పార్టీ వ్యవస్థాపకుడు, అధినేత, కార్యకర్తలు అందరూ కూడా మనుషులే. కానీ డెన్మార్క్‌లో మాత్రం ఓ పార్టీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తోంది. పార్టీ అధినేతగా సూచనలు అందిస్తూ.. ఎలాగైనా డెన్మార్క్ పార్లమెంట్‌లో సీటు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.
సింథటిక్ పార్టీ అనేది డెన్మార్క్‌లోని ఒక కొత్త రాజకీయ సమూహం. 'లీడర్ లార్స్' అని పిలవబడే AI ఎంటిటీ(జస్ట్ లైక్ రోబో) సూచనలకు అనుగుణంగా పనిచేసేందుకు కట్టుబడి ఉంది. ఈ ఏడాది డెన్మార్క్ పార్లమెంట్‌లో సీటు సాధించేందుకు అక్కడి రాజకీయ పార్టీలన్నీ పోటీపడుతుండగా.. వీటిలో సింథటిక్ పార్టీ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మేలో ఆర్టిస్ట్ కలెక్టివ్ కంప్యూటర్ లార్స్ మరియు నాన్-ప్రాఫిట్ ఆర్ట్ అండ్ టెక్ ఆర్గనైజేషన్ మైండ్‌ఫ్యూచర్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ పార్టీ.. 1970ల నుంచి ఎప్పుడూ సీటు పొందని అన్ని డానిష్ ఫ్రింజ్ పార్టీల విధానాలపై ప్రోగ్రామ్ చేసిన AI విధానాలను అనుసరించడానికి అంకితం చేయబడింది. రాజకీయాల్లో AI ఉనికిని ప్రచారం చేస్తున్న ఈ పార్టీ.. ఎన్నికల్లో ఎన్నడూ ఓటు వేయని 20 శాతం డెన్మార్క్ జనాభాకు ప్రత్యామ్నాయంగా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది.
'మేము అన్ని ఫ్రింజ్ పార్టీల డేటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. అంటే పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రయత్నించినా ఇప్పటి వరకు సీటు పొందలేని అన్ని పార్టీలకు సంబంధించినది. ఇక్కడ ఏఐ పనితీరు.. డబ్బు లేదా వనరులు కలిగి ఉండని ఒక వ్యక్తి యొక్క సొంత రాజకీయ దృష్టిని పోలి ఉంటుందుందని వివరించాడు' అని పార్టీ సృష్టికర్త అస్కర్ స్టౌనెస్ చెప్పాడు.
సింథటిక్ పార్టీ ఇప్పటివరకు ప్రతిపాదించిన కొన్ని విధానాలలో నెలకు దాదాపు రూ.11లక్షల సార్వత్రిక ప్రాథమిక ఆదాయం నెలకొల్పడం, ప్రభుత్వంలో ఉమ్మడి యాజమాన్యంలోని ఇంటర్నెట్ మరియు IT రంగాన్ని సృష్టించడం ఉన్నాయి. అయితే ఈ విషయాలు మంచివా, చెడ్డవా? అనే విషయాన్ని AI జడ్జ్ చేయలేదు. అంతేకాక సింథటిక్ పార్టీకి చెందిన విధానాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉండవచ్చు. ఒకవేళ విరుద్ధమైతే.. ఆసక్తికరమైన రీతిలో సాధ్యమయ్యే విధంగా చేయొచ్చు.
ఇవి కూడా చదవండి :
నాకు మెఘా కృష్ణారెడ్డి నుండి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే... : షర్మిల