బంగారాన్ని విసర్జిస్తున్న బ్యాక్టీరియా.. అదెలాగంటే..

by Disha Web Desk 17 |
బంగారాన్ని విసర్జిస్తున్న బ్యాక్టీరియా.. అదెలాగంటే..
X

దిశ, ఫీచర్స్: బ్యాక్టీరియా బంగారాన్ని విసర్జిస్తుందంటే నమ్ముతారా? కానీ ఇది వంద శాతం నిజమని అంటున్నారు శాస్త్రవేత్తలు. అధిక స్థాయిలో విషపూరితమైన కుప్రియా విడస్ మెటాలిడ్యూరాన్స్ అని పిలువబడే బ్యాక్టీరియం తన మనుగడను కొనసాగించేందుకు ఇలా చేస్తుందని గుర్తించారు. బంగారంతో పాటు ఇతర మూలకాలను కూడా వివిధ ప్రక్రియల్లో రిమూవ్ చేసుకుంటుందని.. ఇందుకు గల ప్రక్రియను వివరించారు.

రాడ్-ఆకారంలో ఉండే బ్యాక్టీరియా కుప్రియా విడస్ మెటాలిడ్యూరాన్స్ మొదటిసారిగా 2009లో బంగారాన్ని పూప్ చేస్తున్నట్లు కనుగొనబడింది. అసలు ఇదెలా సాధ్యమవుతుందని చేసిన అధ్యయనంలో C. మెటాలిడ్యూరాన్స్.. హైడ్రోజన్‌తోపాటు వివిధ విషపూరిత భారీ లోహాలు కలిగి ఉన్న నేలల్లో నిలకడగా ఉంటుంది. అంతేకాదు ఈ బ్యాక్టీరియం రాగి, బంగారు అయాన్‌లను కలిగి ఉంటుంది. ఇవి సంకర్షణ చెందడం వలన.. దాని లోపల లోతుగా ఉండిపోయి ఇబ్బందిని సృష్టిస్తాయి.


దీనిని నివారించడానికి బ్యాక్టీరియా తన కణాల నుంచి లోహాలను తొలగించడానికి ఎంజైమ్‌లను వినియోగిస్తుంది. రాగి కోసం, CupA అనే ఎంజైమ్ అమల్లోకి వస్తుంది. అయితే ఆ సమయంలో బంగారం ఉంటే.. ఈ ఎంజైమ్ అణచివేయబడుతుంది. బ్యాక్టీరియాకు ప్రమాదకరమైన రాగి, బంగారు సమ్మేళనాలు సెల్ లోపలే ఉండిపోతాయి.

ఈ టైమ్‌లో CopA అని పిలువబడే మరొక ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. దీంతో బ్యాక్టీరియం.. రాగి, బంగారు సమ్మేళనాలను కణం ద్వారా అంత తేలికగా గ్రహించబడని రూపాల్లోకి మార్చగలదు. దీని కారణంగా తక్కువ రాగి, బంగారు సమ్మేళనాలు సెల్ లోపలికి ప్రవేశిస్తాయి. రాగిని బయటకు పంపే ఎంజైమ్ దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియ బ్యాక్టీరియా ఉపరితలంపై గోల్డ్ నానోపార్టికల్స్ కనిపించడానికి కూడా కారణమవుతుంది.



Next Story