ఈ 5 రాశుల వారికి డబ్బుకు లోటే ఉండదట.. ఏ రాశులో తెలుసా..

by Sumithra |
ఈ 5 రాశుల వారికి డబ్బుకు లోటే ఉండదట.. ఏ రాశులో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్ : కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బులు సంపాదించేందుకు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తాం. అయితే కొంత మంది వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు, ఉద్యోగస్తులు ప్రమోషన్లు కొట్టి ఎక్కువ శాలరీ పెంచుకుంటారు. మరి కొంత మంది ఎంత కష్టపడినా ఎదుగూ బొదుగూ లేకుండా మధ్యతరగతి జీవితాన్నే గడుపుతారు.

అయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు మాత్రమే సంపాదన విషయంలో స్పష్టంగా ఉండి ఎక్కువ శ్రమిస్తారట. తెలివితేటలతో డబ్బును సంపాదించి ఉన్నత స్థాయికి చేరతారట. ఇంతకీ ఆ రాశులేంటి.. ఏయే రాశుల వారు డబ్బును సంపాదించడంలో అనుకున్నది సాధిస్తారు.. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి

మేష రాశి వారికి శక్తి, ఉత్సాహానికి కారకంగా ఉండే అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అంగారకుడి ప్రభావంతో ఎప్పుడూ ఉత్సాహంగా, శక్తివంతంగా కనిపిస్తుంటారు. ఈ రాశివారు తమ శ్రమ సామర్థ్యంతో జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. తాము పెట్టుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు శ్రమిస్తారు. వారి జీవితంలో ఎదురయ్యే సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. డబ్బు సంపాదించేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి అందం, కీర్తి, కళ, ప్రతిభ, సుఖానికి ప్రతీకగా గల శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి కారణంగా వృషభ రాశి వారు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించేందుకు ఒకటి కంటే ఎక్కువ వనరులను వెతుకుతారు. జీవితంలో మంచి స్థాయిని చేరుకునేందుకు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనిని తూచా తప్పకుండా సాధిస్తారు.

మిధున రాశి

మిధున రాశి వారికి చురుకుదనం, తెలివితేటలు, వ్యాపారానికి సంకేతంగా ఉన్న బుధుడు అధిపతిగా ఉంటాడు. దీంతో ఈ రాశివారికి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక, ఉత్సాహం ఉంటుంది. ఈ రాశి వారు ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బు ఎక్కువ సంపాదించే విషయంలో ప్రతి వనరులను సద్వినియోగం చేసుకుంటారు. డబ్బు సంపాదించడంతో పాటు సామాజిక సేవ కూడా చేస్తారు ఈ రాశివారు.

మకర రాశి

మకర రాశి వారికి ప్రతిష్ట, నిబద్ధత, దూర ఆలోచనలకు సంకేతంగా ఉన్న శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు చాలా నిబద్ధతగా, కష్టపడి పనిచేసి మంచి స్థాయికి ఎదుగుతారు. డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించుకుని గమ్యస్థానానికి చేరుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ప్రతిష్ట, నిబద్ధత, దూర ఆలోచనలకు సంకేతంగా ఉన్న శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు ప్రతి విషయాన్ని గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. వీరు డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ చేస్తారు. ఏ విషయంలోనైనా క్లారిటీతో ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కష్టపడి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఈ లక్షణాల కారణంగా వీరికి డబ్బుకు లోటనేదే ఉండదు.

Advertisement

Next Story