అందమైన దీవులు.. అలరించే ప్రకృతి దృశ్యాలు.. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయంటే..

by Javid Pasha |
అందమైన దీవులు.. అలరించే ప్రకృతి దృశ్యాలు.. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయంటే..
X

దిశ, ఫీచర్స్ : చుట్టూ నీళ్లు.. మధ్యలో ఇళ్లు.. పారే సెలయేళ్లు.. పచ్చని చెట్లు.. ప్రకృతి అందాలకు నెలవైన ఇలాంటి దీవులు ఒక్కసారిగా కళ్లముందు కదలాడితే ఎలా ఉంటుంది? మనసు ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతుంది. అది సుదూర ప్రాంతమైనా, దగ్గరలోని పర్యాటక ప్రదేశమైనా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అచ్చం ఇటువంటి అనుభూతికి లోనుచేసే అద్భుత ద్వీపాలు ప్రస్తుతం ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకట్టుకునే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, అందమైన ద్వీపకల్పాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా మొత్తం 9 లక్షల ద్వీపాలు ఉండగా, మన దేశంలోనే 1,382 ఉన్నాయి. వీటిని చూడటానికి నిత్యం లక్షలాది సంఖ్యలో పర్యాకులు వస్తుంటారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక అందమైన దీవులు కలిగిన దేశం స్వీడన్. ఇక్కడ ఉత్తర ధ్రువానికి సమీపంలో 2,67,570 ద్వీప సమూహాలు ఉన్నాయట. అయితే వీటిలో 96,000 ద్వీపాల గురించి మాత్రమే చాలామందికి తెలుసుకు. వీటన్నింటిలో కలిపి 80 వేలమంది నివసిస్తున్నారు. ఇక స్వీడన్‌లో బాల్టిక్ సముద్రంలోని గోట్లాండ్‌ని అతి పెద్ద ద్వీపంగా పేర్కొంటారు.

అందమైన దీవులు కలిగిన దేశాల జాబితాలో స్వీడన్ తర్వాత ఆర్కిటిక్ రెండవస్థానంలో నిలిచింది. ఇక్కడి హిమానీ నదాలు, పర్వతాలు మొదలు కొని సమశీతోష్ణ ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న అడవులు, సరస్సులు, అందమైన చెట్లు, ఎగుగు దిగుడు లోయలు చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాకుండా నార్వేజియన్ ధ్రువ ఎలుగు బంట్లు, వాల్ రస్‌లు రెయిన్‌డీర్‌ వంటి అనేక జంతు సమూహాలు ఈ దీవుల్లో తిరగాడుతూ ఆకట్టుకుంటాయి. ఇక నార్వేలో మొత్తం 2,39,057 దీవులు ఉండగా, వాటిలో 60 వేలమంది జనాభా నివసిస్తోంది.

ఇక గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్‌లో అయితే ఫిన్లాండ్ ప్రాపర్, బాల్టిక్ సముద్రంలోని ఆలాండ్ దీవులు ముఖ్యమైనవి. అలాగే కెనడాలో కూడా 50 వేల ద్వీపాలు ఉండగా ఇందులో కేవలం 52 మాత్రమే నివాస యోగ్యంగా ఉన్నాయి. స్కాండినేవియన్ దేశాలలో ఒకటైన ఫిన్లాండ్‌లో మొత్తం 1,70,000 ద్వీపాలు ఉండగా, ఇక్కడ 80 వేలమంది నివసిస్తున్నారు. ఆలాండ్ అనేది ఫిన్లాండ్‌లోని అతిపెద్ద ద్వీపం. ఇక ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా పేర్కొనే అమెరికాలో మొత్తం 18,000 ద్వీపాలు ఉండగా, అందులో కేవలం 50 ద్వీపాలలో మాత్రమే ప్రజలు ఉన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గల అతిపెద్ద ద్వీపం హవాయి. యూఎస్‌లోని ఒక రాష్టం అయిన అలాస్కాలోనూ అలరించే పెద్ద ద్వీపం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండోనేషియాలో 17,508, ఆస్ట్రేలియాలో 8,200, ఫిలిప్పీన్స్‌లో 7,641 దీవులు ఉన్నాయి. ఇవన్నీ అందమైన ప్రకృతి దృశ్యాలతో, చుట్టూ సముద్రపు నీళ్లతో, ఎత్తైన పర్వతాలతో, విశాలమైన మైదానాలతో చూడముచ్చటగా ఉంటాయి.

Next Story