నోటిలో చెడు రుచి వేధిస్తోందా? ఇలా బయటపడొచ్చు!

by Disha Web Desk 6 |
నోటిలో చెడు రుచి వేధిస్తోందా? ఇలా బయటపడొచ్చు!
X

దిశ ఫీచర్స్ : సరిగ్గా బ్రష్ చేయకుంటే, కడుపులో ఏవైనా సమస్యలుంటే లేదా యాంటీబయాటిక్స్ వాడకం వల్ల ఒకటి రెండు రోజులు నోటిలో రుచి చెడుగా అనిపిస్తే ప్రమాదం లేదు. కానీ ఎక్కువ రోజులు ఇదే పరిస్థితి అనుభవిస్తే మాత్రం అనారోగ్యానికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. మరి అసహ్యకరమైన రుచికి కారణం ఏమిటి? నోటిని తాజాగా ఉంచుకునేందుకు ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఇక్కడ తెలుసుకుందాం.

దంత పరిశుభ్రత:

నోట్లో అసహ్యకరమైన రుచికి ప్రధాన కారణం బ్రషింగ్, మౌత్ వాష్ సరిగ్గా చేయకపోవడం. ఈ పరిస్థితే నోటిలో చెడు రుచి, దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా ఏర్పడేందుకు కారణమై అంటువ్యాధులకు కూడా దారితీస్తుంది. అంతేకాదు కొత్తగా వచ్చే జ్ఞానదంతాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు.

మందులు :

కొన్ని రోగాలకు మందులు వాడుతున్న వ్యక్తుల లాలాజల గ్రంథులు తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయవు. దీంతో నోటిలో చెడు రుచి కలిగే అవకాశముంది. యాంటీబయాటిక్స్, విటమిన్ సప్లిమెంట్లు లేదా యాంటీ హిస్టమైన్లు వాడేవారు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు:

యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారిలోనూ ఇదే పరిస్థితి తలెత్తవచ్చు. అంతేకాదు అజీర్ణంతో బాధపడుతున్నపుడు పైత్యరసం, ఆమ్లం.. అన్నవాహిక ద్వారా పైకి తన్నుకొచ్చి సమస్యను కలిగిస్తుంది.

హెపటైటిస్ :

'హెపటైటిస్ బి' అనే లివర్ ఇన్ఫెక్షన్‌ వ్యాధికి ఈ లక్షణాలను ప్రారంభ సంకేతాలుగా చెప్పొచ్చు. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. ఆ ప్రభావం నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్(రుచి గుళికలు)పై పడుతుంది.

హార్మోన్ల మార్పులు :

గర్భధారణ, రుతువిరతి వంటి అనేక హార్మోన్ల మార్పులు చెడు రుచికి దారితీస్తాయి. గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి, చివరి త్రైమాసికంలో ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు.. హార్మోన్లలో హెచ్చుతగ్గులు చాలా వేగంగా జరుగుతాయి. ఇక మెనోపాజ్‌లో దశలో ఉన్న స్త్రీల నోరు పొడిబారడం, నోట్లో మంటను ఎదుర్కొంటారు.

చెడు రుచిని అధిగమించే చిట్కాలు :

* చూయింగ్ గమ్ లేదా షుగర్‌లెస్ మింట్ నమలాలి.

* రెగ్యులర్‌గా బ్రష్ చేసుకుంటూ నోటిని శుభ్రం చేసుకోవాలి.

* వంట కోసం నాన్-మెటాలిక్ పాత్రలు ఉపయోగించాలి.

* నీరు ఎక్కువగా తాగాలి.

* ధూమపానం మానేయాలి.

* ప్రతిరోజు యాపిల్ లేదా క్యారెట్లను తినడం ద్వారా నోటిపై ఉండే మలినాలను తొలగించవచ్చు.

* కొబ్బరి నూనెను కొద్దిగా నోటిలో వేసుకుని పుక్కిలిస్తే.. హానికర బ్యాక్టీరియా తొలగిపోతుంది. పళ్ల చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి.

సోష‌ల్ మీడియాలో కొత్త బ‌ర్త్‌డే ట్రెండ్..! (వీడియో)

Next Story