ప్రపంచంలో ఎత్తయిన ఏటీఎం.. రెండు దేశాల సరిహద్దులో

by Dishanational4 |
ప్రపంచంలో ఎత్తయిన ఏటీఎం.. రెండు దేశాల సరిహద్దులో
X

దిశ, ఫీచర్స్: మంచుతో కప్పబడిన పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏటీఎం కనిపించడం వింతగా ఉంటుంది కదా. పాకిస్తాన్‌, ఉత్తర గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుంజెరాబ్ పాస్ సరిహద్దులో అలాంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన క్యాష్ మెషిన్‌గా గుర్తింపు పొందగా.. చైనా, పాకిస్తాన్ బార్డర్‌లో 4,693 మీటర్ల ఎత్తులో ఉంది. సౌర, పవన శక్తితో నడిచే ఈ నగదు యంత్రాన్ని నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్(NBP) 2016లో ఇన్‌స్టాల్ చేసింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా సర్టిఫై చేయబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ ఏటీఎంను ఇన్‌స్టాల్ చేయడం చాలా క్లిష్టమైన ప్రయత్నంగా చెప్పొచ్చు. దీనిని పూర్తి చేసేందుకు NBPకి నాలుగు నెలల సమయం పట్టింది. ఇక రెగ్యులర్ మెయింటెనెన్స్‌తో పాటు ప్రతిరోజూ మెషిన్‌లో నగదు నింపడం కూడా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే సమీపంలోని బ్యాంకు 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. Sost NBP బ్రాంచ్ మేనేజర్ జాహిద్.. విపరీతమైన గాలులు, తుఫాన్లు, తరచుగా విరిగిపడే కొండచరియలు, ప్రమాదకరమైన పర్వత మార్గాలను ఎదుర్కొంటూ రెగ్యులర్‌గా ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తుంటాడు.

సముద్ర మట్టానికి 4,693 మీటర్ల ఎత్తులో ఉన్నందున ఇక్కడ రద్దీ పెద్దగా ఉండదు. ఎక్కువగా నెలవారీ జీతాలు తీసుకునే సరిహద్దు గార్డులకు, కొద్దిమంది స్థానికులతో పాటు పాస్ ద్వారా సరిహద్దును దాటే కొద్ది మందికి మాత్రమే ఈ మెషిన్ సేవలందిస్తుంది. కాగా ప్రతి రెండు వారాలకు ఈ మెషిన్ నుంచి దాదాపు 4 నుంచి 5 మిలియన్ రూపాయలు ($18,350 - $23,000) విత్‌డ్రా చేయబడతాయి. అయితే లావాదేవీలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ యంత్రంపై ఆధారపడే వ్యక్తుల కారణంగా బ్యాంక్ ఈ యంత్రాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది.

Also Read: అంతర్జాతీయ బాలికా దినోత్సవం



Next Story

Most Viewed