విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయురాలిని చితక్కొట్టిన టీచర్లు (వీడియో)

by Disha Web Desk 2 |
విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయురాలిని చితక్కొట్టిన టీచర్లు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు దారితప్పి ప్రవర్తించారు. విద్యార్థుల ముందే క్లాస్ రూమ్‌లో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో జరిగింది. కొరియా పంచాయతీలోని ఓ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, ఉపాధ్యాయురాలు అనితా కుమారి మధ్య కిటికీ తెరిచే విషయంలో మాటా మాటా పెరిగింది. దీంతో మొదట క్లాస్ రూమ్‌లోనే గొడవకు దిగగా ఆ తర్వాత బయటకు వచ్చి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారిపై అనిత కుమారి దాడి చేయగా అనితకు తోడుగా మరో మహిళా టీచర్ జతచేరింది.

ఆ ఇద్దరు కలిసి కాంతి కుమారిపై దాడి చేశారు. జుట్లు పట్టుకుని, చెప్పులు, కర్రతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా తన్నుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న స్థానికులు కలగజేసుకుని గొడవను ఆపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ స్పందిస్తూ వారి వ్యక్తిగత కారణాలతోనే వారు గొడవ పడ్డారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు టీచర్లకు నోటీసులు జారీ చేశారు.

Next Story

Most Viewed