'ఫ్లైట్ మోడ్' పరేషాన్?

by Hamsa |
ఫ్లైట్ మోడ్ పరేషాన్?
X

దిశ, ఫీచర్స్ : ఫ్లైట్ జర్నీ ప్రారంభించే ముందు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులకు సూచనలు చేయడం పరిపాటి. 'సీట్లు నిటారుగా ఉంచుకోవడం, ట్రే టేబుల్స్ క్లోజ్ చేయడం, విండో షేడ్స్ పైకి లేపడం సహా ల్యాప్‌టాప్స్‌ను ఓవర్‌హెడ్ బిన్స్‌లో స్టోర్ చేయమనడం అందులో భాగమే. అయితే ఈ జాగ్రత్తల వెనక సరైన కారణం ఉంది కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో ఫ్లైట్ మోడ్‌‌ ఆన్ చేయమనడం వెనకున్న రీజన్ మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకో ఇపుడు తెలుసుకుందాం.

విమానయానంలో నేవిగేషన్, కమ్యూనికేషన్.. రేడియో సేవలపై ఆధారపడతాయి. ఇతరత్రా అంతరాయాలను తగ్గించేందుకు ఇవి 1920 నుంచి సమన్వయం చేయబడ్డాయి. అయితే 60 ఏళ్ల కిందట కూడా ఉపయోగించిన కొన్ని పాత అనలాగ్ టెక్నాలజీస్ కంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న డిజిటల్ టెక్నాలజీ అధునాతనమైనది. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు.. విమాన కమ్యూనికేషన్లు, నేవిగేషన్ సిస్టమ్స్ మాదిరిగానే అదే ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో సిగ్నల్‌ను విడుదల చేయగలవని పరిశోధనలో తేలింది. దీనిని 'విద్యుదయస్కాంత జోక్యం' అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మొబైల్ ఫోన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి విభిన్న ఉపయోగాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌విడ్త్‌లను సృష్టించడం ప్రారంభించింది. కాబట్టి అవి ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోవు. ఇక ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలు విమానయానంతో జోక్యం చేసుకునే సమస్యల నివారణకు ఒకే విధమైన వ్యూహాలు, విధానాలను అభివృద్ధి చేశాయి. ఈ మేరకు EUలో ఎలక్ట్రానిక్ పరికరాలను 2014 నుంచి అనుమతించారు.

2.2 బిలియన్ ప్రయాణీకులు

అయినప్పటికీ ప్రపంచవ్యాప్త విమానయాన పరిశ్రమ మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధాన్ని ఎందుకు కొనసాగించింది? అంటే వైర్‌లెస్ నెట్‌వర్క్స్.. టవర్ల శ్రేణి ద్వారా కనెక్ట్ చేయబడతాయి. ఈ గ్రౌండ్ నెట్‌వర్క్‌ల మీదుగా ప్రయాణించే ప్రయాణికులందరూ తమ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే నెట్‌వర్క్‌లు ఓవర్‌లోడ్ అవుతాయి. వాస్తవానికి, మొబైల్ నెట్‌వర్క్‌ల విషయానికొస్తే.. ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద మార్పు 5G వైర్‌లెస్ నెట్‌వర్క్స్. దీని అధిక డేటా స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ విమానయాన పరిశ్రమలో చాలా మందికి ఆందోళన కలిగించాయి. 5G వైర్‌లెస్ నెట్‌వర్క్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయబడిన ఏవియేషన్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రమ్‌కు చాలా దగ్గరగా ఉందని విమానయాన పరిశ్రమ ఎత్తి చూపింది. ఇది ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్‌లో సాయపడే విమానాశ్రయాల దగ్గర నావిగేషన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి 5G చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించబడినప్పుడు విమానాలలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం వివేకమని నిపుణులు చెబుతున్నారు.

నియంత్రణలేని ప్రవర్తనలు మర్చిపోవద్దు..

ప్రస్తుతం చాలావరకు ఎయిర్‌లైన్స్ కస్టమర్లకు Wi-Fi సేవలు అందజేస్తున్నాయి. ఈ కొత్త Wi-Fi సాంకేతికతలతో ప్రయాణీకులు విమానంలోనే ఫ్రెండ్స్ లేదా క్లయింట్స్‌తో వీడియో కాల్స్ చేయడానికి సిద్ధాంతపరంగా వారి మొబైల్ ఫోన్లను ఉపయోగించవచ్చు. ఇదిలా ఉంటే.. విమానయానంలో ఫోన్ వాడకంపై ఒక క్యాబిన్ అటెండెంట్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రయాణీకులకు అవసరమైన డ్రింక్స్ లేదా ఫుడ్ గురించి అడిగేందుకు వారి కాల్ పూర్తయ్యే వరకు వేచి ఉండటం క్యాబిన్ సిబ్బందికి అసౌకర్యంగా ఉంటుందని ఆమె పేర్కొంది. 200+ ప్రయాణికులున్న ఎయిర్‌లైనర్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్ కాల్స్ చేస్తుంటే విమానంలో సర్వీస్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇదేకాక అంతరాయం కలిగించే ప్రయాణీకుల ప్రవర్తనలు ఎక్కువగా ఉన్న సమయంలోనూ విమానంలో ఫోన్ వినియోగం.. మొత్తం ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్‌ను మార్చేయవచ్చు. సీటు బెల్టు ధరించకపోవడం.. తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బందితో మాటల వాగ్వివాదాలు, భౌతిక దాడులు వంటి భద్రతా అవసరాలు పాటించకపోవడం నుంచి విఘాతం కలిగించే ప్రవర్తనలు వివిధ రూపాల్లో ఉంటాయి. సాధారణంగా ఇవే ఎయిర్ రైజ్‌గా గుర్తించబడతాయి.

విమానంలో ఫోన్‌ల వినియోగం ప్రస్తుతం విమానం ఆపరేట్ చేసే సామర్థ్యాన్ని దెబ్బతీయదు. కానీ క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకులందరికీ విమానంలో సేవలను అందించడంలో ఆలస్యం కాకూడదని భావిస్తారు. అయితే, 5G సాంకేతికత ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ సిస్టమ్‌ల రేడియో బ్యాండ్‌విడ్త్‌ను ఆక్రమిస్తోంది. ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్‌కు సంబంధించిన 5G ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తమకు మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story

Most Viewed