పచ్చని సంసారాలను కూలుస్తున్న పని మనుషులు

by Hamsa |
పచ్చని సంసారాలను కూలుస్తున్న పని మనుషులు
X

దిశ, ఫీచర్స్: వైవాహిక జీవితం ఎల్లప్పుడూ చాలా సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. నిజాయితీ, గౌరవం, నమ్మకం అనే పునాదిమీద నిలబడిన ఈ బంధంలో అపార్థాలు, సమస్యలు ప్రవేశిస్తే విచ్ఛిన్నం కావచ్చు. ఇక మూడవ వ్యక్తి ఎంటర్ అయితే ఆ రిలేషన్ విడిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైకాలాజిస్ట్‌లు. ముఖ్యంగా భారతీయుల విషయంలో ఇంటి పనిమనిషే డివోర్స్‌కు మూలంగా మారుతున్నట్లు రీసెంట్‌గా ఓ సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు.

ఇంటి పనిమనుషులు చాలా తెలివిగా, చాకచక్యంగా వివాహ బంధాన్ని నాశనం చేస్తారు. అయితే ఈ నిజాన్ని విన్నపుడు చాలామంది నెటిజన్లు ‘అలా చేయగలరా?’ అని ఆశ్చర్యపోయినట్లు సర్వే నిర్వాహకులు చెప్పారు. ఈ క్రమంలోనే కొంతమంది పురుషులు స్వయంగా తమ విడాకులు, వివాదాలకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.

మా పనిమనిషికి క్యూరియాసిటీ ఎక్కువ :

‘మా పనిమనిషి చేసేదంతా మా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు అడగడమే. గిన్నెలు కడుగుతున్నప్పుడు లేదా నేల తుడిచేటప్పుడు కూడా ‘మా భార్యను ఈ మధ్యకాలంలో ఏమి చేస్తున్నారు. దేని గురించి ఆలోచిస్తున్నారు’ అంటూ చాలా సాధారణంగానే అనేక ప్రశ్నలు అడుగుతుంది. నా భార్య కూడా కొన్నిసార్లు నేను లేనప్పుడు ఆమెతో మనసు విప్పి మాట్లాడుతుందని నేను గమనించాను. ఆమెతో సంభాషణ పెరుగుతున్న క్రమంలో మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక కారణంతో నా భార్య నన్ను విసిగించడం మొదలుపెట్టింది. ఒక పనిమనిషి ప్రతి రోజు మన ఇంట్లో, పర్సనల్ విషయాల్లో కూడా తలదూర్చి ఏమి జరిగిందో అడగడం చెత్తగా అనిపించింది’ అని ఒక పురుషుడు వివరించాడు.

గొడవల సమయంలో నా భార్యకు మద్దతుగా నిలుస్తుంది:

‘మా రోజువారీ గొడవల్లో మా పనిమనిషి చాలా అనుచితంగా ప్రవర్తిస్తుంది. నా భార్య, నేను ఒకరితో ఒకరం పోట్లాడుకుంటున్నప్పుడు.. భార్యను వంట గదిలోకి తీసుకెళ్లి బ్యాకప్ చేస్తుంది. నాపై కక్షపూరితంగా ఎలా వ్యవహరించాలో పక్కగా నూరిపోస్తుంది. పూర్తిగా ఆమె తన పక్షం వహిస్తూ ‘మీరు చెప్పేది సరైనదే దీదీ’ అంటూ నాముందే భయపడకుండా చెప్పేస్తుంది. అప్పుడు నా భార్య తాను అనుకున్నదే కరెక్ట్ అని భావించి.. మా వివాహంలో జరిగిన అన్ని తప్పులకు నన్ను నిందిస్తూనే ఉంది. అయినా సరే పనిమనిషిని తీసేసే ధైర్యం చేయలేకపోయాను’ అంటూ 45ఏళ్ల వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు.

మా వైవాహిక జీవితం గురించి ఇతరులతో మాట్లాడుతుంది :

‘మా పనిమనిషి విషయానికొస్తే.. నేను, నా భార్య ఆమె కారణంగా డివోర్స్ దశకు చేరుకున్నాం. ఆమె ఎల్లపుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకోవడం ఆమె వల్ల కాదని చాలా విషయాల్లో రుజువైంది. అయినా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ, అది నెమ్మదిగా మా వైవాహిక జీవితం గురించి ఇతరులతో చెప్పేదాకా వచ్చింది. మరింత ఓపెన్‌గా చెప్పాలంటే.. మా చుట్టూ ఉన్న మొత్తం ఇరుగుపొరుగు జంటల గొడవల గురించి గాసిప్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇది నిజంగా నిరుత్సాహకరంగా అనిపించింది. ఎందుకంటే మా పర్సనల్ విషయాలకు సంబంధించి ప్రతిదీ బయటకు రావడం నాకు ఇష్టం లేదు’ అంటూ కొత్తగా పెళ్లైన యువకుడు చెప్పుకొచ్చాడు.

Also read: మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తికి పెళ్లైందా..!! తెలుసుకోవడం ఎలా..?

Next Story