అక్కడి స్త్రీలల్లో మద్యం సేవించే అలవాటు ఎక్కువ.. ఎందుకంటే..

by Javid Pasha |
అక్కడి స్త్రీలల్లో మద్యం సేవించే అలవాటు ఎక్కువ.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మద్యం పురుషులు మాత్రమే ఎక్కువగా సేవించేవారు. స్త్రీలలో ఈ అలవాటు చాలా తక్కువ. కానీ ఇటీవల కాలంలో స్త్రీ, పురుషులందరూ మందు కొడుతున్నారు. మన దేశంలోనూ ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మద్యం ఇష్టపడే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే మహిళలు మద్యం సేవించే ధోరణి అంతటా ఉండకపోవచ్చు. ఉన్నచోట కూడా ప్రత్యేక కారణాలు, అంశాలపై ఆధారపడి ఉండవచ్చు. ఉదాహరణకు జీవన శైలి, సంప్రదాయం, వాతావరణం వంటివి కూడా ఈ అలవాట్లలో కీలకపాత్ర పోషిస్తాయి. సాధారణంగా చల్లటి వాతావరణం ఉన్నచోట మద్యం ఎక్కువగా వినియోగిస్తుంటారు.

ఆరోగ్య నిపుణులు ప్రకారం మద్యం ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ చాలామంది దీనిని తాగుతుంటారు. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఒక పురుషుడు ఒకేసారి 5 డ్రింక్స్, ఒక మహిళ ఒకేసారి 4 డ్రింక్స్ తీసుకుంటే వారు మద్యానికి బానిసగా మారినట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మహిళలు ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్న మన దేశంలోని రాష్ట్రాల జాబితాలో అరుణాల్ ప్రదేశ్ ముందంజలో ఉంది. ఇక్కడి మహిళలల్లో 24.2 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఇక సిక్కిం రెండవ స్థానంలో ఉండగా ఇక్కడి మహిళల్లో దాదాపు 16 శాతం మందికి మద్యపానం అలవాటుగా ఉంది. మద్యం ఎక్కువ తాగుతున్న మహిళల విషయానికి వస్తే అస్సాం మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ 7.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. 6.7 శాతంతో తెలంగాణ నాలుగవ స్థానంలో, 6.1 శాతంతో జార్ఖండ్ ఐదవ స్థానంలో ఉన్నాయి.



Next Story

Most Viewed