రైలు చివరి భోగి వెనుక ఆ గుర్తు ఉంటుంది.. గమనించారా! ఆ సింబల్ లేకపోతే డేంజరే?

by Disha Web Desk 23 |
రైలు చివరి భోగి వెనుక ఆ గుర్తు ఉంటుంది.. గమనించారా! ఆ సింబల్ లేకపోతే డేంజరే?
X

దిశ,వెబ్‌డెస్క్: చౌకైన, సౌకర్యవంతమైన ప్రయాణాలలో ఒకటి రైలు ప్రయాణం. రవాణాకు అత్యధికంగా రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. దేశవ్యాప్తంగా మొత్తం రైల్వేల పొడవు 67,956 కిలోమీటర్లు. భారతీయ రైల్వే భద్రతకు సంబంధించి ప్రత్యేక సంకేతాలు ఉంటాయి. రైలు చివరి భోగి వెనుక 'ఎక్స్' గుర్తు ఉంటుంది. అయితే ఆ 'ఎక్స్' అనే దేనికి సంకేతమో తెలుసుకుందాం..

బోగీ వెన‌క భాగంతో ఎక్స్ అనే పెద్ద సింబ‌ల్‌, దానికి ద‌గ్గర‌గా ఎల్‌వీ అనే అక్షరాలు రాసుంటాయి. దీని అర్థం లాస్ట్ వెహికిల్ అని. బోగీ చివ‌ర వెనుక భాగంలో చిన్న ఎల్లో క‌ల‌ర్ బోర్డు కూడా ఉంటుంది. ఇది రెండు వైపులా ఉంటుంది. ఎక్స్ అనే సింబ‌ల్ కింది భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతుంటుంది. ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్రత్తప‌డేందుకు ఈ సింబ‌ల్ వేస్తార‌ట‌. రాట్రిపూట బోగీ వెన‌కాల ఉండే ఎక్స్ సింబ‌ల్‌, దానికింద ఉండే రెడ్ లైట్‌ను బ‌ట్టి అల‌ర్ట్ అవుతారు. రైలు ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ విధంగా సింబ‌ల్స్ వేస్తుంటారు.

వాస్తవానికి ఈ సంకేతాలకు ప్రయాణికులకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏదైనా రైలుకి చివ‌ర‌న ఈ గుర్తు ఉండ‌కుంటే రైల్వే ఉద్యోగి అప్రమ‌త్తం కావాల్సి ఉంటుంది. వెంటనే సమీప కంట్రోల్ రూమ్‌కు తెలియ‌జేయాలి. లేదంటే అత‌డి ఉద్యోగం పోతుంది. ఈ రెండు సంకేతాలు రైలు చివరి బోగికి కనిపించకపోతే రైలు చివరి కంపార్ట్మెంట్ లేదా వెనుక భాగంలో ఉండో బోగీలు విడిపోయాయ‌ని భావిస్తారు. అందుకే రైల్వే అధికారులు అప్రమ‌త్తం అవుతారు.

Next Story

Most Viewed