ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారా? ఈ ఒక్క చిట్కాతో మీరు యంగ్‌గా మారొచ్చు..

by Disha Web Desk 9 |
ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారా? ఈ ఒక్క చిట్కాతో మీరు యంగ్‌గా మారొచ్చు..
X

దిశ, ఫీచర్స్: మీకు ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా? అయితే మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ఇందులో వినియోగించే టౌరిన్ అనే సప్లిమెంట్ వృద్ధాప్య ప్రక్రియను మందగిస్తుందని, జీవశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించారు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలుకలు, కోతులపై చేసిన ప్రయోగంలో ఈ మైక్రోన్యూట్రియంట్ సానుకూల ఆరోగ్య ప్రభావాలను కలిగించడంతో పాటు జీవితకాలాన్ని పెంచింది.

ఇక పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ విజయ్ యాదవ్.. సహజంగా శరీరంలో టౌరిన్ ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. జంతువులలో టౌరిన్ లెవల్స్ ఎక్కువగా మెయింటెన్ చేయడం మూలంగా ఆరోగ్యకరమైన జీవితంతో పాటు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందన్నారు. కాగా మాంసం లేదా చేపలు వంటి ప్రోటీన్ కలిగిన ఆహారాలలో టౌరిన్ సహజంగా లభిస్తుంది. మానవ శరీరం కణాలలో చర్యల కోసం టౌరిన్‌ను ఉపయోగిస్తుంది. శక్తి ఉత్పత్తికి ఉపయోగించబుతున్న టౌరిన్.. బైల్ యాసిడ్స్ ప్రాసెస్ చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. ద్రవాలు, లవణాలు మరియు ఖనిజాలను సమతుల్యం చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఈ జ్యూస్ తాగితే చాలు.. అందంతో పాటు ఆరోగ్యం కూడా

Next Story

Most Viewed