Summer: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఇలా చేయండి!

by Disha Web Desk 10 |
Summer: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్: వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం కూల్ వాటర్, చల్లని పదార్థాలు తీసుకోవడానికే అందరూ ఇష్టపడతారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు చికాకును కలిగిస్తాయి. ఏవి మేలు చేస్తాయో, ఏవి మంచి చేస్తాయో తెలుసుకుందాం. వంటకాల్లో సహజంగా సుగంధ ద్రవ్యాలు వాడుతుంటారు. ఇవి రుచిని కూడా పెంచుతాయి. అయితే వేసవిలో వీటిని కొంచెం తగ్గించుకోవాలి. వీలైనంత ఎక్కువగా వాటర్ తాగాలి. అదే విధంగా మాంసాహారం, చేపలు, చికెన్, సీ ఫుడ్స్ వంటివి కడుపులో చికాకును కలిగిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం బెటర్. వేపుడు పదార్థాలు, బర్గర్లు, మిర్చి బజ్జీలు సహా వివిధ ఆయిల్ ఫుడ్స్, వేడి వేడి కాఫీ లేదా టీ తీసుకోవడం అనేవి చికాకును పెంచుతాయి. ఈ సీజన్‌లో ఎలాంటి సాస్‌ను కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఇందులో 350 కేలరీలు ఉంటాయి వివిధ సమస్యలకు దారి తీస్తాయి. రోజూ తినే ఆహారంలో పెరుగు, మజ్జిగను తీసుకోవడం వేసవిలో చాలా మేలు చేస్తుంది. ఉదర సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఫైబర్, నీటిశాతం అధికంగా ఉండే దోసకాయ తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పుదీనా కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి దీనిని రసాన్ని నిమ్మకాయ రసంతోపాటు నీళ్లలో కలిపి తాగడం చాలా మంచిది.

Read more:

వీటిని పాలతో కలిపి తీసుకుంటున్నారా .. తేడా వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం.



Next Story

Most Viewed