ఇత‌ర జంతువుల కంటే భిన్నంగా మ‌నిషి మాట్లాడ‌టానికి రీజ‌న్ ఇదే..?!

by Disha Web Desk 20 |
ఇత‌ర జంతువుల కంటే భిన్నంగా మ‌నిషి మాట్లాడ‌టానికి రీజ‌న్ ఇదే..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః నేటి ఆధునిక మ‌నిషి వెనుక ఎంతో మాన‌వ ప‌రిణామ క్ర‌మం దాగుంది. ప్ర‌తి ద‌శ‌లోనూ ఒక ఆలోచ‌న‌, ఆచ‌ర‌ణ, మార్పుతో.. ఆయా మార్పుల‌కు త‌గ్గ‌ట్లు మాన‌వ ఆలోచ‌న‌తో పాటు దేహంలోని అవ‌య‌వాలు కూడా స‌వ‌ర‌ణ పొందాయి. ఈ క్ర‌మంలోనే, వాయిస్ బాక్స్‌లోని అనేక పరిణామాత్మక మార్పుల ఫలితంగా మానవులు మాట్లాడే శక్తిని ఎలా పొందగలిగారో ఒక‌ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇతర ప్రైమేట్‌ల నుండి మానవుడిని వేరు చేసే అనేక మార్పులు కాలక్రమేణా సంభవించాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ అధ్యయనంలో, 43 జాతుల వాయిస్ బాక్స్‌లను పరిశీలించగా, ఇతర జాతుల‌ గొంతులో స్వర పొర అనేది లేద‌ని వారు కనుగొన్నారు. పొర అంటే, "స్వర తంతువులకు సంబంధించిన‌ చిన్న, రిబ్బన్ లాంటి పొర‌లు." ఈ గాలి సంచులు అని పిలిచే "బెలూన్-లాంటి స్వరపేటిక నిర్మాణాలు" లేకపోవడం వల్ల కోతుల్లా బిగ్గరగా అరిచే పిలుపును సృష్టించే సామర్థ్యం మానవులకు లేదని కూడా అధ్యయనం కనుగొంది. ఈ సంచులు లేకపోవడమే మానవులకు స్థిరమైన స్వరాన్ని కలిగి ఉండటానికి కారణమ‌ని తెలిసింది. మ‌నుషుల మాట‌లు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం కూడా ఇదేన‌ని వారు తెలిపారు. సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన‌ ఈ అధ్యయనం, "చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, గిబ్బన్‌లతో సహా పురాత‌న‌ ప్రపంచ కోతులు - మకాక్‌లు, గునాన్‌లు, బాబూన్‌లు, మాండ్రిల్స్, అలాగే, ఆధునిక ప్ర‌పంచ‌ కోతులు - కాపుచిన్‌లు, టామరిన్‌లు, మార్మోసెట్‌లతో సహా కోతుల అనాటమీలను పరిశీలించారు.



Next Story