మరో ప్రపంచం పిలిచింది.. శ్రీ శ్రీ జయంతి

by Dishanational2 |
మరో ప్రపంచం పిలిచింది..  శ్రీ శ్రీ జయంతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మాటలతో చెప్పలేని భావాలను కలంతో చెప్పడం ఆయనకు అలవాటు. తన కలం నుంచి జాలు వారిన అక్షరాలెన్నో ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయాయి. మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచిందంటూ.. ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుని తన గీతాలు, కవితల ద్వారా ధైర్యాన్ని నింపారు. ''నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా'' అంటూ సినీకవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రతి వస్తువులోంచి ఒక కోణాన్ని వెతికి, కుక్కపిల్ల అగ్గిపుల్ల, సబ్బు బిల్లా.. కవితామయమేనోయ్ అన్నీ అంటూప్రతి వస్తువుకు తన కవిత ద్వారా ప్రాణం పోశారు. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన రోజు ఈరోజు.

20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు నేడు. సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన ఈ విప్లవ కవి 1928 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. 'మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం' అని ఎలుగెత్తి చాటిన శ్రీరంగం శ్రీనివాసరావు.. తెలుగు సాహిత్యపు దశదిశను మార్చిన మహానుభావుడిగా మన్ననలు పొందాడు. చిన్నతనంలోనే రచనలు చేయడం ప్రారంభించిన ఆయన.. తనకు ఏ కాగితం కనిపించినా లేక సిగరెట్ ప్యాకెట్ అట్ట కనిపించినా దానిపై కవితలు రాసేవాడు. అలా తన మొదటి గేయాల పుస్తకాన్ని ఎనిమిదవ ఏట ప్రచురితం చేసిన శ్రీశ్రీ.. 18వ ఏట 1928లో 'ప్రభవ' అనే కావ్య సంపుటిని ప్రచురించారు. అలా1950లో 'మహా ప్రస్థానం' అనే కవితా సంకలనాన్ని రచించగా.. ఈ రచనే శ్రీశ్రీని మహాకవిగా మార్చింది. అంతేకాదు ఆధునిక సాహిత్యాన్ని, మహా ప్రస్థానానికి ముందు మహా ప్రస్థానానికి తర్వాత అని విభజించే స్థాయిలో ఈ కవితల సంకలనం ప్రభావితం చేసింది. ఇక శ్రీ శ్రీ సాహిత్య తపస్సుకు గుర్తింపుగా 'ఖడ్గ సృష్టి' కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979 లో శ్రీ రాజ్య లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. అలా 'అభ్యుదయ రచయితల సంఘం(అరసం)', 'విప్లవ రచయితల సంఘం(విరసం)' లాంటి ప్రజాసంఘాలకు అధ్యక్షులుగా పని చేశారు.

శ్రీశ్రీ కవిత

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా..

హీనంగా చూడకు దేన్నీ!

కవితామయమేనోయ్ అన్నీ!

రొట్టెముక్కా, అరటి తొక్కా,బల్లచెక్కా

నీ వేపే చూస్తూ ఉంటాయ్!

తమ లోతు కన్నోమంటాయ్!

తలపు గొళ్లెం, హారతిపళ్లెం, గుర్రపుకళ్లెం

కాదేదీ కవిత కనర్హం!

జౌనౌను శిలప్ప మనర్ఘం!

ఉండాలోయ్ కవితావేశం!

కానీవోయ్ రస నిర్దేశం!

దొరకదటోయ్ శోభాలేశం

కళ్లంటూ ఉంటే చూసి,

వాక్కుంటే వ్రాసీ!

ప్రపంచమొక పద్మ వ్యూహం

కవిత్వమొక తీరని దాహం!

Next Story

Most Viewed