పక్షులను ఎవరు నిద్ర లేపుతారు..?

by Dishanational1 |
పక్షులను ఎవరు నిద్ర లేపుతారు..?
X

దిశ, వెబ్ డెస్క్: పావురాలు, పిట్టలు, చిలుకలు, మైనాలు.. ఇలా ఎన్నో రకరకాల పక్షులు అందమైన రూపంతో అనేక రంగులతో చూడ ముచ్చటగా ఉంటాయి. అన్ని జీవరాశులలో పక్షులకు మాత్రమే ఈకలు ఉన్నాయి. మనిషికి గోళ్లు పెరిగిన విధంగానే ఈ పక్షులకు ఈకలు పెరుగుతాయి. పక్షి గుండెకు నాలుగు కవాటాలుంటాయి. పైగా ఇతర జంతువుల హృదయ స్పందన కన్నా వీటి హృదయ స్పందన వేగంగా ఉంటుంది. ఎందుకంటే పక్షులు ఎగిరేందుకు అదనపు శక్తి అవసరం ఉంటుంది. అందువల్ల వీటిలో రక్త ప్రసరణ వేగంగా జరిగి స్పందన కూడా వేగంగా ఉంటుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాగా ఎత్తులో ఎగిరే పక్షుల గుండె పరిమాణం మిగిలిన పక్షుల గుండెకన్నా పెద్దగా ఉంటది. వాటి శరీర ఉష్ణోగ్రత్తలు కూడా ఇతర జంతువుల కన్నా ఎక్కువగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటే మనిషికి జ్వరం వస్తుంది. కానీ, పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 105-110 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. ఈ అధిక హీట్ పక్షులు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై, ఎగిరేందుకు అవసరమైన శక్తి ఇచ్చేందుకు సహాయపడుతుంది.

అదేవిధంగా పక్షులకు ఇతర జంతువుల్లా దంతాలు ఉండవు. అవి ఆహారాన్ని మింగుతాయి. గొంతులో ఉన్న ప్రత్యేక ఏర్పాటు వల్ల జీర్ణ ప్రక్రియ అక్కడే ఆరంభమవుతుంది. పక్షులు కూడా ఊపిరితిత్తుల సాయంతోనే శ్వాస తీసుకుంటాయి. అసలు విషయమేమంటే... మనల్ని తమ కిలకిలారావాలతో నిద్ర లేపే పక్షులను ఎవరు నిద్రలేపుతారు..? అనే కదా మీ డౌట్. అయితే, వీటిని సూర్యుని వెలుగు రేఖలు నిద్ర లేపుతాయి. వెలుతురు వచ్చిన తర్వాత వాటి కళ్లు మూతపడవు. అందుకే వెలుతురు వచ్చిన వెంటనే అవి నిద్ర లేస్తాయి.


Next Story

Most Viewed