ఎడారిలో మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం.. మరి Camels ఎలా ఉంటాయి..?

by Dishanational1 |
ఎడారిలో మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం.. మరి Camels ఎలా ఉంటాయి..?
X

దిశ, వెబ్ డెస్క్: మనం ఎప్పుడైనా ఎడారికి వెళితే అక్కడే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం. అలాంటిది ఒంటెలు ఎలా ఉంటాయనేది చాలామంది ప్రశ్న. అదేమంటే.. ఎడారుల్లో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం, నీరు లభిస్తాయి.. ఆహారం లభించినప్పుడు ఒంటె దొరికినంత ఆహారాన్ని ఆకలి వేయకపోయినా భుజిస్తుంది. అలాగే నీరు లభించినప్పుడు కూడా అంతే అవసరానికి మించి తాగేస్తుంది. అలా తీసుకున్న అధిక ఆహారాన్ని కొవ్వు రూపంలోకి మార్చుకుని తన మూపురంలో దాచుకుంటుంది. ఆహారం దొరకని సమయంలో మాపురంలోని కొవ్వుని కరిగించుకుని శక్తిని సమకూర్చుకుంటుంది. అందువల్లే ఆహారం తీసుకున్నాక ఒంటె మూపురం పెద్దగా మారుతుంది. అదేవిధంగా కొవ్వు కరిగాక చిన్నదైపోతుంది. ఇక నీటి విషయానికొస్తే ఒంటె నీటిని మూపురంలో దాచుకోదు. జీర్ణాశయంలోని సంచిలాంటి అరలుంటాయి. వాటిలో నీటిని నింపుకుని అవసరమైనప్పుడు వాడుతుంటది. అందుకే ఒంటె ఎడారిలో కూడా ఉండగలదు.

ఇవి కూడా చదవండి : చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు

Next Story