పాలతో సైడ్ ఎఫెక్ట్స్...

by Hamsa |
పాలతో సైడ్ ఎఫెక్ట్స్...
X

దిశ, ఫీచర్స్: శిశువు ఈ లోకంలోకి వచ్చాక ఇచ్చే మొదటి ఆహారం పాలు. అసాధారణ లక్షణాలు కలిగిన మిల్క్ అప్పటి నుంచే మన ఆహారంలో ముఖ్యమైన భాగమైపోతుంది. కానీ చాలా మంది ఖాళీ కడుపుతోనే పాలు తాగుతుంటారు. కానీ ఇది సరికాదని చెప్తోంది ఆయుర్వేదం. రోజును పాలతో ప్రారంభించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తోంది. అలాంటప్పుడు పాలు తాగేందుకు సరైన సమయమేంటి? ఎందుకు అదే టైమ్‌లో తీసుకోవాలి? చూద్దాం.

మీరు పాలతో రోజు ప్రారంభించాలా?

శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. నిస్సందేహంగా రోజుకు ఖచ్చితమైన ప్రారంభాన్ని ఇస్తుంది కానీ చాలా మంది నిపుణులు దీనిపై విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఒక గ్లాసు పాలు మరియు తృణధాన్యాలతో రోజును ప్రారంభించడం భారీ భోజనంగా పరిగణిస్తున్నారు. ఉదయం పాలు తీసుకోవడం మానేసి తేలికైన ఆహారంతో రోజును ప్రారంభించాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల మంచి కంటే హాని అధికంగా ఉందని చెప్తోంది. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ స్థాయిని పెంచడం మూలంగా చర్మానికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణవ్యవస్థపై భారమైన పనిని అమలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది భారీ భోజనం జీర్ణం చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది, కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి.

పాలు త్రాగడానికి ఉత్తమ సమయం ఏది?

ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం పాలు త్రాగడానికి ఉత్తమం. ఇవి పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో కూడా సహాయపడుతాయి. ఉదయం పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెప్తున్న నిపుణులు.. సాయంత్రం తాగడం వల్ల నిద్ర మరియు నరాల విశ్రాంతికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని వివరిస్తున్నారు.



Next Story

Most Viewed