చాక్లెట్ తిన్నప్పుడు ఎందుకంత బెస్ట్ ఫీలింగ్.. కనిపెట్టిన సైంటిస్టులు

by Disha Web |
చాక్లెట్ తిన్నప్పుడు ఎందుకంత బెస్ట్ ఫీలింగ్.. కనిపెట్టిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: చిన్నాపెద్ద తేడా లేకుండా చాక్లెట్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా నోట్లో కరిగిపోయే గుణం కలిగిన చాక్లెట్ తింటున్నప్పుడు ఆ మధురానుభూతిని వర్ణించలేమని చెప్తుంటారు. ఇంతకీ ఇంతటి బెస్ట్ ఫీలింగ్ ఎందుకు కలుగుతుందో కనిపెట్టేశారు శాస్త్రవేత్తలు. నోటిలో చాక్లెట్ విరిగిపోయినప్పుడు జరిగే భౌతిక ప్రక్రియ ఇందుకు కారణమని వివరించారు.

ఎందుకు రుచికరమైనది?

చాక్లెట్‌ను నోటిలో పెట్టుకున్నప్పుడు అందులోని కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నం కావడం వల్ల తింటే చాలా బాగుంటుందని తెలిపారు లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. చాక్లెట్ నాలుకతో సంబంధంలోకి వచ్చినప్పుడు, అది కొవ్వు పొరను విడుదల చేస్తుంది. నాలుక, మిగిలిన నోటిని టోటల్‌గా కోట్ చేస్తుంది. అందుకే అది ఎంత సమయం నోట్లో ఉంటే అంతసేపు మృదువుగా ఉంటుంది. ఇక చాక్లెట్ సిగ్నేచర్ స్వీట్‌నెస్ దాన్ని లూబ్రికేట్ చేసిన విధానం నుంచి వస్తుందన్న పరిశోధకులు.. చాక్లెట్‌లోని పదార్థాలు, లాలాజలం లేదా రెండింటి కలయిక ద్వారా ఆ అనుభూతి కలగొచ్చని తెలిపారు. చాక్లెట్ ముక్క నోటిలో కరగడం ప్రారంభించిన వెంటనే, చాక్లెట్ సిగ్నేచర్ టేస్ట్ ఫీలింగ్‌ను నిర్ధారించే బాధ్యత కొవ్వుకు ఉంటుంది. దీని తరువాత చాక్లెట్‌లో ఉండే కోకో కణాలు శారీరక అనుభూతికి కారణమవుతాయి.

'మీరు మంచి రుచి, ఆకృతి లేదా ఆరోగ్య ప్రయోజనాలతో ఆహారాన్ని రూపొందించడానికి ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. ఒక చాక్లెట్‌లో 5 శాతం కొవ్వు లేదా 50 శాతం కొవ్వు ఉంటే అది నోటిలో బిందువులను ఏర్పరుస్తుంది. మీకు చాక్లెట్ అనుభూతిని ఇస్తుంది. కొవ్వు పొర చాక్లెట్ బయటి పొరపై ఉండాలని మేము చూపుతున్నాము. ఇది చాలా ముఖ్యమైనది. కొవ్వు ద్వారా కోకో కణాలను సమర్థవంతంగా నోట్లో పూయడం ద్వారా బెస్ట్ ఫీలింగ్ కలిగించడంలో చాక్లెట్‌కు సహాయపడతాయి' అని పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: చాయ్-సమోసాపై మనసుపడుతున్న బ్రిటిషర్స్


Next Story