- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
Parasitic Fungus: పారాసిటిక్ ఫంగస్.. బ్రెజిల్‌లో స్పైడర్స్‌ను వేటాడే పరాన్నజీవిని కనుగొన్న సైంటిస్టులు

దిశ, ఫీచర్స్ : బ్రెజిల్‌లోని అట్లాంటిక్ రెయిన్‌ఫారెస్ట్‌లో ట్రాప్‌డోర్ స్పైడర్‌లకు సోకి, వాటి మరణానికి కారణం అవుతున్న పరాన్నజీవి ఫంగస్(parasitic fungus)ను కనుగొన్నట్లు సైంటిస్టులు పేర్కొన్నారు. అయితే ఈ ఫంగస్ వాటిని చంపడానికి ముందు, వాటి బిహేవియర్‌ను కంట్రోల్ చేస్తుందని నిరూపించే ఆధారాలను మాత్రం ఇంకా సేకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అరుదైన ఈ ఫంగస్ పర్పుల్ కలర్‌లో ఉంటుందని, ఇది అకశేరుకాలను సోకిన తర్వాత హోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు సమూహంలో భాగంగా మారుతుందని పరిశోధకులు వెల్లడించారు.
రీసెర్చ్‌లో భాగంగా పరిశోధకులు నవంబర్‌లో రియో డి జనీరోకు ఉత్తరాన ఉన్న అడవులకు(north of Rio de Janeiro) వెళ్లారు. క్షేత్ర పర్యటనలో ఉండగా పరాన్న జీవి ఫంగస్‌ను కనుగొన్నారు. ప్రధానంగా వారు ఈ ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేయడానికి, కొత్త జాతులను కనుగొనడానికి అడవులను సందర్శించారు. కానీ అదే సందర్భంలో ఊహించని రీతిలో పరాన్నజీవి ఫంగస్‌ను కూడా కనుగొన్నామని న్యూయార్క్ బొటానికల్ గార్డెన్‌కు చెందిన బ్రెజిలియన్ మైకాలజిస్ట్(mycologist) డాక్టర్ జోవో అరౌజో(Joao Araujo) చెప్పాడు. ఇది నిజంగా అద్భుతమైన విషయం అని సంతోషం వ్యక్తం చేశాడు. పర్పుల్ కలర్‌లో ఉండే ఆ ఫంగస్ ట్రాప్‌డోర్ స్పైడర్‌లకు సోకుతుందని, దీని గురించి అంతకు ముందు ఎవరికీ తెలియదని, ఈ రకమైన ఫంగస్ ప్రపంచంలో చాలా తక్కువగా ఉందని అతను చెప్పాడు. ఎక్కువగా థాయిలాండ్‌లో ఆ తర్వాత బ్రెజిల్‌లో ఇలాంటి జాతులను చూడటం ఇదే మొదటిసారి అన్నాడు.
న్యూయార్క్ బొటానికల్ గార్డెన్, క్యూ, రాయల్ బొటానికల్ గార్డెన్స్, రియో డి జనీరో బొటానికల్ గార్డెన్, ఇతర సంస్థల సహకారంతో అతను ఫంగస్‌లు, పక్షులు, పాములు, కప్పలు, మొక్కలపై పరిశోధనలు చేస్తున్నామని డాక్టర్ జోవో అరౌజో వెల్లడించాడు. ప్రస్తుతం కనుగొన్న పరాన్న జీవి ఫంగస్‌ను పంటలలో తెగుళ్ల నుంచి రక్షించడానికి ఉపయోగించవచ్చు’’ అని పరిశోధకుడు అరౌజోతోపాటు ఫీల్డ్ సీక్వెన్సింగ్‌ను నిర్వహించిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ నటాలియా ప్రజెలోమ్‌స్కా, డాక్టర్ ఆస్కార్ అలెజాండ్రో పెరెజ్ ఎస్కోబార్ పేర్కొన్నారు.