వాతావరణాన్ని మార్చే ‘రాక్ వెదరింగ్’ టెక్నాలజీ.. గ్లోబల్ వార్మింగ్ నివారణ సాధ్యమే!

by Disha Web Desk 23 |
వాతావరణాన్ని మార్చే ‘రాక్ వెదరింగ్’ టెక్నాలజీ.. గ్లోబల్ వార్మింగ్ నివారణ సాధ్యమే!
X

దిశ, ఫీచర్స్: రాక్ వెదరింగ్ టెక్నాలజీ ద్వారా క్లైమేట్ చేంజ్ నెగెటివ్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు, వాటి పర్యవసనాలు ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇటీవల ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) కూడా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్‌పై తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది. వాతావరణం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచం ఇంకా చాలా దూరంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అప్రమత్తం కావాలని మించి పోలేదని పర్యావరణ వేత్తలు, ఐపీసీసీ నిపుణులు పేర్కొంటున్నారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను(greenhouse gas) తగ్గించడానికి సాధ్యమయ్యే మల్టిపుల్ మానవ ప్రయత్నాలు అవసరమని, మెరుగైన రాక్ వెదరింగ్ ప్రక్రియ అందుకు దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు.

రాక్ వెదర్ అంటే ఏమిటి?

ఇది వాతావరణం నుంచి ప్రకృతి-ఆధారిత కార్బన్ డయాక్సైడ్‌(CO₂)ను తొలగించగలిగే అధునాతన టెక్నాలజీ. దీనిని UNDO అనే కంపెనీ తయారు చేస్తోంది. ‘‘మిలియన్ల సంవత్సరాలుగా కార్బన్ డయాక్సైడ్ వర్షపునీటితో కలిసి కార్బోనిక్ యాసిడ్‌ను ఏర్పరుస్తుంది. ఈ పలుచనైన ఆమ్లం పర్వతాలు, అడవులు, గడ్డి భూములపై పడినప్పుడు CO₂ రాళ్లు, మట్టితో ఇంటరాక్ట్ చెందడం, మినరలైజ్ అవడం జరుగుతుంది. ఫలితంగా అది కార్బోనేట్ రూపంలో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది’’ అని UNDO కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే నేచరల్ రాక్ వెదరింగ్ ఏర్పడాలంటే వందల సంవత్సరాలు పడుతుందని, వేచి ఉండటానికి సమయం లేదని, ప్రస్తుతం తమవద్ద ఉన్న టెక్నాలజీని యూజ్ చేయడంవల్ల మేలు జరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది. వ్యవసాయ భూమిలో పిండిచేసిన బసాల్ట్ రాక్‌ను వ్యాప్తి చేయడం ద్వారా, శిల యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా, మొక్కల మూలాలు, నేల సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన CO₂తో తక్షణ సంబంధాన్ని (immediate contact) అందించడం ద్వారా మెరుగైన రాక్ వెదరింగ్ ప్రాసెస్ అనేది వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తుందని అండూ (UNDO) సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సంవత్సరం 1,85,000 టన్నుల బసాల్ట్‌ను విస్తరించాలని, 2025 నాటికి మిలియన్ టన్నుల CO2ని తొలగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నది.

నిపుణులు ఏం చెప్తున్నారు?

మెరుగైన రాక్ వాతావరణం వంటి కార్బన్ తొలగింపు పద్ధతులు ఉద్గారాలను తగ్గించే ప్రాధాన్యతపై కొందరు పర్యావరణ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది క్లైమేట్ చేంజ్ పర్యవసనాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చర్య కావచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కార్బన్ రిమూవల్ ఎక్స్‌పర్ట్ అయినటువంటి డాక్టర్ స్టీవ్ స్మిత్ (Dr Steve Smith) మాట్లాడుతూ.. ఈ ఆలోచన భూమిని సాగుచేసే విధానంలో ఒక ప్రామాణిక భాగాన్ని (standard part) మాత్రమే ప్రభావితం చేయగలుగుతుందని చెప్పారు. మొత్తం వాతావరణం వేడెక్కడాన్ని ఆపగలిగే సామర్థ్యంపై ఇంకా క్లారిటీ లేదన్నారు. ఈ కోణంలో ఇంకా పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. మే 21న ఐక్యరాజ్యసమితి (UN) శాస్త్రవేత్తలు కూడా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మాత్రమే ప్రమాదకర స్థాయి వేడెక్కడాన్ని ఆపడానికి సరిపోదని స్పష్టం చేశారు. అయితే వాతావరణం నుంచి కొంత కార్బన్ డయాక్సైడ్ తొలగింపు అవసరమని, ప్రజెంట్ మెరుగైన రాక్ వాతావరణం(enhanced rock weathering) అని పిలువబడే ప్రక్రియ వేడెక్కుతున్న భూగ్రహాన్ని చల్లబరుస్తుందని అభిప్రాయపడ్డారు.

Read More: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?


Next Story

Most Viewed