సుదీర్ఘ అంతరిక్ష యాత్రలతో నష్టం.. మెదడును దెబ్బతీస్తాయంటున్న పరిశోధకులు

by Disha Web Desk 6 |
సుదీర్ఘ అంతరిక్ష యాత్రలతో నష్టం.. మెదడును దెబ్బతీస్తాయంటున్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్: సుదీర్ఘ అంతరిక్ష యానం వ్యోమగాముల మెదడును డ్యామేజ్ చేస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా పరిశోధకులు మొత్తం 30 మందిని స్టడీ చేశారు. వీరిలో 8 మంది అంతరిక్షంలో రెండువారాలు గడిపినవారు కాగా 18 మంది ఆరు నెలలు గడిపినవారు ఉన్నారు. మరో నలుగురు కక్ష్యలో ఏడాదిపాటు గడిపినవారు కూడా ఉన్నారు. అయితే అంతరిక్ష యాత్రలకు ముందు, తర్వాత వ్యోమగాముల బ్రెయిన్ స్కాన్‌లను పరిశోధకులు విశ్లేషించారు. ఈ సందర్భంగా 2 వారాల తర్వాత మెదడులో ఎటువంటి మార్పులు కనిపించలేదు. కానీ ఆరు నెలలకుపైగా సాగిన అంతరిక్ష పర్యటనల ఫలితంగా మెదడు జఠరికలు (brain ventricles) గణనీయంగా పెరిగాయని, వాటి నుంచి కోలుకోవడానికి మూడు సంవత్సరాల సమయం పట్టవచ్చని కనుగొన్నారు.

మెదడులో ఉండే బోలు(hollow )వంటి ప్రాంతంలో జఠరికలు(ventricles) ఉంటాయి. ఇవి బ్రెయిన్‌ను ప్యూరిఫైడ్ అండ్ హైడ్రేట్ చేస్తూ రక్షించే ఫ్లూయిడ్స్‌తో నిండి ఉంటాయి. సాధారణంగా ఈ ఫ్లూయిడ్ శరీరం మొత్తం పనితీరుకు దోహదం చేస్తుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంవల్ల వ్యోమగాములు అక్కడి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఈ ద్రవం బలవంతంగా మెదడు పుర్రెలో పైకి నెట్టబడుతుంది. ఫలితంగా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపే కొద్దీ వ్యోమగాముల్లో జఠరికలు పెద్దవిగా మారినట్లు తాము కనుగొన్నామని ఫ్లోరిడా యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజియాలజీ అండ్ కినిషియాలజీ ప్రొఫెసర్, పరిశోధకుడు రాచెల్ సీడ్లర్(Rachael Seidler) పేర్కొన్నారు.

.Read more: ఆ దేశంలో మంగళవారం పెళ్లి చేసుకోరట.. ఎందుకో తెలుసా?

దెయ్యాలు, ఆత్మలు కొంత మందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా?

Next Story

Most Viewed