గుమ్మడికాయ సూపర్ ఫుడ్ కానీ, వీళ్లు మాత్రం అసలు తినకూడదు!

by Prasanna |
గుమ్మడికాయ సూపర్ ఫుడ్ కానీ, వీళ్లు మాత్రం అసలు తినకూడదు!
X

దిశ, ఫీచర్స్: గుమ్మడికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఐడి రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అందుకే దీన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయతో పాటు, దాని గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

గుమ్మడి కాయలో జింక్, విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో 96 శాతం నీరు కూడా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్, అనేక ఇతర సమస్యలను నివారిస్తుంది.

దీనిని సాంబారు, హల్వా, పప్పు, పులుసు ఇలా రకరకాలుగా తయారు చేసుకుని తింటారు. గుమ్మడికాయతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే.. ఆరోగ్యానికి మేలు చేసే గుమ్మడి. కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు అసలు తినకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. ఎసిడిటీ సమస్య ఉన్నవారు గుమ్మడికాయ తినకూడదు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. ఇది అధిక GIని కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed