మార్నింగ్ టిఫిన్‌గా పూరీ తింటున్నారా..క్యాన్సర్ బారిన పడే ఛాన్స్!

by Jakkula Samataha |
మార్నింగ్ టిఫిన్‌గా పూరీ తింటున్నారా..క్యాన్సర్ బారిన పడే ఛాన్స్!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం బాగుంటే, మనం హెల్దీగా ఉంటాం. కానీ కొంత మంది మంచి ఫుడ్ తీసుకోకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. అయితే టిఫిన్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందని ఎక్కువగా పూరీలు తింటారు. కానీ పూరిని టిఫిన్‌గా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి అంటున్నారు వైద్య నిపుణులు.హోటల్లో దొరికే పూరీలు తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎందుకంటే, హోటల్స్‌లల్లో ఆయిల్ అస్సలే మార్చరు. చాలా రోజులుగా వాడుతున్న ఆయిల్ కూడా అలానే ఉంటుంది. అందువలన అది మనం తినడం వలన షుగర్, బీపీ లాంటి సమస్యలు వస్తాయంట. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింటుందని,అలాగే మలబద్దక సమస్యలు కూడా తలెత్తుతాయి అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story