ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

by Jakkula Samataha |
ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
X

దిశ, ఫీచర్స్ : ఉదయాన్నే కాఫీ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. మార్నింగ్ కాగా, కాఫీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇకొంత మంది అసలు బ్రష్ కూడా చేయకముందే కాఫీ తాగుతారు. అయితే ఇలా పొద్దున్నే పరగడుపున కాఫీ తాగడం వలన అనారోగ్య సమస్యలకు స్వాగతం పలుకుతున్నట్లే అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది , న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన అడెనోసిన్‌ , మెదడులోని రిసెప్టర్స్‌తో బైండ్‌ కాకుండా అడ్డుకుంటుంది. అడెనోసిన్‌ మగతను ప్రోత్సహిస్తుంది. దీనిని అడ్డుకోవడం వల్ల శరీరంలోని అలసట మాయమవుతుంది. అందుకే కాఫీ తాగినప్పుడు, అందులోని కెఫిన్ కారణంగా అలసట అనుభూతిని తాత్కాలికంగా పోతుంది. దీంతో మరింత యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇలా మనం ఉదయాన్నే కాఫీ తాగినప్పుడు అది కొద్ది సేపటి తర్వాత అలసట, కళ్లు తిరడగం లాంటిది జరుగుతుందంట. అంతే కాకుండా మహిళలు మార్నింగ్ పరగడుపున టీ తాగడం వలన నెలసరిలో చాలా సమస్యలు ఎదురవుతాయంట.అలాగే మన శరీరంలో కెఫిన్ ఎక్కువై, ఇబ్బందులు ఎదురవుతాయంట. అందువలన ఉదయం పరగడపున కాకుండా కాస్త టైం తీసుకొని కాఫీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట.

మార్నింగ్ లేవగానే కాఫీ తాగకూడదంటున్నారు వైద్యులు. పొద్దున్నే కాకుండా, రోజులో ఇతర సమయాల్లో కాఫీ తాగాలని వారు సూచిస్తున్నారు. దీంతో శరీరంలోని సహజమైన అడెనోసిన్ స్థాయిలు పెరిగేలా చేస్తుందంట. దీనివల్ల సహజంగానే మరింత యాక్టివ్‌గా ఉండటం సాధ్యమవుతుంది. ఉదయానికి బదులు మధ్యాహ్నం పూట కాఫీ తాగవచ్చు. ఒక మోస్తరు మొత్తం, అంటే సుమారుగా 100 mg కెఫిన్ ఒక్కసారిగా తాగడం వలన అది అలసటకు దారితీయకుండా శక్తిని అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు.



Next Story