Health tips:బెడ్‌షీట్స్ రెగ్యులర్‌గా వాష్ చేయకుంటే.. ఈ మూడు వ్యాధులు తప్పవా?

by Disha Web Desk 6 |
Health tips:బెడ్‌షీట్స్ రెగ్యులర్‌గా వాష్ చేయకుంటే.. ఈ మూడు వ్యాధులు తప్పవా?
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యం, శ్రేయస్సు విషయంలో రెగ్యులర్‌గా నిద్రించే మంచం పాత్రను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అలసిన శరీరానికి ప్రశాంతతో కూడిన గాఢ నిద్రను అందించేది అదే. అయితే, బెడ్‌షీట్ శుభ్రంగా ఉందా? లేదా? చూసుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. షీట్లను తరచూ మార్చకపోవడం లేదా వాష్ చేయకపోవడం అనేది ఒక వ్యక్తి పరిశుభ్రత గురించి ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా మూడు ప్రధాన వ్యాధుల ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి 'అపెండిసైటిస్, న్యుమోనియా, గనేరియా'కు దారితీయొచ్చని వెల్లడిస్తున్నారు.

మురికి బెడ్ షీట్‌తో వ్యాధుల ప్రమాదం?

స్లీప్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. శరీరం ప్రతి రాత్రి అనేక మృత చర్మ కణాలతో పాటు ద్రవాలు, నూనెలను స్రవిస్తుంది. ఇది రినిటిస్, తామర, అలెర్జీ, ఉబ్బసంతో సంబంధమున్న మల పదార్థాన్ని విసర్జించే దుమ్ము, పురుగులను ఆకర్షిస్తుంది. అందువల్ల, బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మార్చడం చాలా ముఖ్యం. అనారోగ్యంతో లేదా ఇన్‌ఫెక్షన్, జలుబు లేదా ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల విషయంలో ఇది మరింత ఆవశ్యకం. ఇక ఈ దుమ్ము, పురుగులు కొంతమందిలో అలర్జీలను కూడా ప్రేరేపిస్తాయి.

సంబంధిత లక్షణాలు :

* దురద కళ్లు

* జలుబు

* దగ్గు

* తుమ్ములు

* చర్మంపై దద్దుర్లు

కణాల కంటే శరీరంలో చాలా బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, మంచం మీద పడుకున్నప్పుడు మృత చర్మ కణాలు బ్యాక్టీరియా వృద్ధి చెందగల షీట్లకు చేరుతాయి. అవి తిరిగి చర్మంపైకి వస్తే 'ఫోలిక్యులిటిస్‌'కు దారి తీస్తుంది. ఇది చికాకుతో పాటు పరాన్నజీవులు లేదా బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు 'న్యుమోనియా, అపెండిసైటిస్' వంటి తీవ్రమైన సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఒక్కోసారి అపెండిక్స్ పగిలిపోయి తీవ్ర ఇన్‌ఫెక్షన్లకు కారణం కావచ్చు.

అందువల్ల, బ్యాక్టీరియా వ్యాధులకు కేంద్రంగా మారకుండా నిరోధించడానికి కనీసం వారానికోసారి షీట్లను వాష్ చేయడం మంచిది. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం షీట్లను తీసి కొద్దిసేపు ఎండలో వేయడం ద్వారా సూక్ష్మక్రిములను వదిలించుకోవచ్చు.

భార్యాభర్తల బంధం బలపడాలంటే బెడ్ రూంలోనే కాదు.. బాత్ రూంలోనూ అలా చేయాలట..!


Next Story

Most Viewed