మాంసంతినే పురుషులతో పడుకోవద్దు : 'పెటా' సెక్స్ స్ట్రైక్

by Disha Web Desk 6 |
మాంసంతినే పురుషులతో పడుకోవద్దు : పెటా సెక్స్ స్ట్రైక్
X

దిశ, ఫీచర్స్ : పురుషులకు గుణపాఠం చెప్పేందుకు జంతు సంరక్షణ సంస్థ 'పెటా' సరికొత్త పద్ధతిని కనిపెట్టింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం వాతావరణ సంక్షోభానికి పురుషుల మాంసం వినియోగం ప్రధాన కారణంగా కనుగొనబడింది. దీంతో నాన్ వెజ్ ఎక్కువగా తినే పురుషులపై సెక్స్ స్ట్రైక్‌ విధించాలని 'పెటా' మహిళలను కోరింది. అంతేకాదు ఇది ప్రపంచాన్ని క్లైమేట్ క్రైసిస్ నుంచి కాపాడుతుందని, విషపూరితమైన మగతన వ్యాప్తిని అరికట్టడంలో సాయపడుతుందని సంస్థ పేర్కొంది.

ప్లోస్ వన్ జర్నల్‌'లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, వాతావరణ విపత్తుకు స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా దోహదపడుతున్నారు. ప్రధానంగా మాంసం వినియోగంతో కూడిన వారి ఆహారపు అలవాట్లే 41 శాతం గ్రీన్‌హౌస్ వాయువులకు కారణమవుతున్నాయని పెటా తన ప్రకటనలో పేర్కొంది. పురుషులు తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఒక సెక్షన్‌ మగాళ్లను టార్గెట్ చేస్తూ.. 'నగర శివారు ప్రాంతాల్లో పురుషులు తమ చేతిలో బీర్ సీసాలతో, ఖరీదైన గ్యాస్ గ్రిల్స్‌పై సాసేజ్‌లను హీట్ చేస్తుంటారు. ఇలా బార్బెక్యూస్, గ్రిల్ మాంసాన్ని తయారు చేసే పురుషులు జంతువులను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు' అని పెటా వెల్లడించింంది.

ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ కారిస్ బెన్నెట్.. 'ఆహార విషయంలో పురుషులు, స్త్రీల మధ్య తేడాలు గమనించబడ్డాయి. పురుషులు ఎక్కువగా మాంసం తీసుకుంటున్నందున స్త్రీల కంటే ఎక్కువ కార్బన్ ముద్ర కలిగిఉంటారు. దీన్ని తగ్గించేందుకు 'సెక్స్ బ్యాన్' ఆలోచన బాగా పనిచేస్తుంది. అంతేకాదు పర్యావరణాన్ని కాపాడేందుకు 'పెటా' ప్రతిపాదనలో మాంసంపై పన్ను విధించడం కూడా ఉంటుంది' అని తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

నాతో సెక్స్‌కు అబ్బాయిలు అంగీకరించట్లేదు.. ఆన్‌లైన్‌లో మాత్రమే


Next Story