- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నారో అంతే సంగతి.. అవేంటంటే?
దిశ, ఫీచర్స్: డయాబెటిస్ సమస్యతో ప్రస్తుతం రోజుల్లో ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే ఒక్కసారి కనుక షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం తగ్గదు. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి పలు జాగ్రత్తలు పాటించడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. సరైన ఆహారం, టైమ్‌కు మందులు వాడకపోతే షుగర్ పేషెంట్స్‌కు చాలా ఇబ్బందుల పడాల్సి వస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు చక్కెర స్థాయిలకు కంట్రోల్‌లో ఉంచుకోవడం కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను తమ డైట్‌లో భాగం చేసుకుంటారు.
కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను మాత్రం షుగర్ ఉన్నవారు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిల్లో ఉండే చక్కెర స్థాయిలు శరీరంలోకి చేరడం వల్ల చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి కొన్నింటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కార్బోహైడ్రేట్ల కారణంగా బ్లడ్, షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. అయితే కొన్నింటికి దూరంగా ఉండటం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎండుద్రాక్ష: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించినప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం మర్చిపోయి కూడా వీటిని తినకూడదు. వీటిల్లో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఎండు ద్రాక్ష తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దూరంగా ఉండాలి.
ఖర్జూరం: వీటిల్లో చక్కెరలు అంతగా ఉండవని భావిస్తుంటారు. కానీ ఖర్జూరంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకపోవడం మంచిది.
అంజీర: అంజీర పండ్లలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు వంటివి ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే ఫుగర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదం.
క్రాన్బెర్రీస్: డ్రై ఫ్రూట్లలో క్రాన్బెర్రీస్‌ను మహిళలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి మూత్రానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అలాగే పలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం చక్కెర స్థాయిని పెంచుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము. దీనిని దిశ ధృవీకరించదు.