దెయ్యాలు ఉన్నాయా.. లేవా..? ఇదిగో సాక్ష్యం! చూసిన వారిలో 60 % మంది

by Disha Web Desk |
దెయ్యాలు ఉన్నాయా.. లేవా..? ఇదిగో సాక్ష్యం!  చూసిన వారిలో 60 % మంది
X

దిశ, ఫీచర్స్ : మీరు దెయ్యం ఉంటుందని నమ్ముతారా? ఎప్పుడైనా చూశారా? అవును అనేది మీ ఆన్సర్ అయితే గనుక మీరు ఒంటరిగా లేరు. ఎందుకంటే కొన్ని సర్వేలు, అధ్యయనాలు కూడా ఘోస్ట్‌ను విశ్వసించేవారు ఎక్కువ మందే ఉంటున్నట్లు పేర్కొంటున్నాయి. పైగా ఎక్కువశాతం మంది వాటిని అనుభవపూర్వకంగా ఎదుర్కొన్నట్లు వెల్లడిస్తుంటారు. ఈ అతీంద్రియ శక్తుల గురించిన నమ్మకం కేవలం ఇప్పుడు మాత్రమే ఏర్పడింది కాదు. దశాబ్దాల నుంచి ఉంది. చరిత్ర అంతటా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మానవ భయాలకు అర్థం వెతికే క్రమంలో సమాధానం దొరకని నమ్మకాలు కూడా ఇందుకు కారణం అవుతుంటాయి. చాలా మంది వ్యక్తులు బలంగా విశ్వసించే పారానార్మల్ ఆలోచనలు కలిగి ఉంటున్నప్పటికీ, సైన్స్ కూడా అంతే గట్టిగా వాటికి తగిన వివరణలు ఇస్తుంది. అవేంటో చూద్దాం.

అతీంద్రియ నమ్మకాలు

గత అధ్యయనం ప్రకారం.. దాదాపు 75% మంది అమెరికన్లు పారానార్మల్‌కు సంబంధించి కనీసం ఒక నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు. అక్టోబర్ 2018 సర్వే ప్రకారం 60% కంటే ఎక్కువ మంది దెయ్యాన్ని ఫేస్ చేసినట్లు తేలింది. అయితే ఆయా వ్యక్తుల్లో తమకు తాము ఇచ్చుకునే పవర్ ఆఫ్ సజెషన్స్ వల్ల మాత్రమే ఇలాంటి భావనలు, భ్రమలు ఏర్పడతాయని సైన్స్ చెప్తోంది. అంటే కొందరు వ్యక్తులు తమ అంచనాలు, నమ్మకాల కారణంగా నిజంగానే ఆ దృశ్యాలను చూస్తున్నట్లు భ్రమపడతారు. ఒక రహస్య ప్రదేశంలో దెయ్యాలు ఉన్నాయని విన్నప్పుడు ఇటువంటి అతీంద్రియ ఊహలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

1997 నాటి పరిశోధన

1997లో ఒక వింత థియేటర్‌లో 22 మంది వ్యక్తులను ఉంచడం ద్వారా నిపుణులు పరిశోధన నిర్వహించారు. అదేంటంటే.. థియేటర్‌లో కొంతమంది రెస్సాండెంట్స్‌ను ఉంచారు. వీరిలో సగం మందికి ముందుగానే అక్కడ దెయ్యాలు ఉంటాయని తెలియజేశారు. మిగిలిన సగం మందికి ఆ థియేటర్ నిర్మాణం ఇంకా కొనసాగుతుందని తెలియజేశారు. ఇలా రెండు విషయాలు తెలిసిన, రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఆ థియేటర్‌లో ఉన్నంతసేపు ఏ గ్రూపువారు ఎలా ఫీలయ్యారో తర్వాత తెలుసుకుంటే, దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు భయాన్ని, వింత శబ్దాలను, అతీంద్రియ విషయాలను అనుభవించినట్లు పరిశోధకులకు వెల్లడించారు. అంటే ఇక్కడ బలమైన నమ్మకం దెయ్యాలు ఉన్నాయనేలా భ్రమకు అవకాశం కల్పించింది.

బ్రెయిన్ ఇష్యూస్

కొందరు ఘోస్ట్‌ను నమ్మడం వెనుక వారి బ్రెయిన్ ఇష్యూస్ కూడా రీజన్ అవుతుంటాయని, అందుకే దానిని ఎదుర్కొంటున్నట్లు భ్రమపడే వ్యక్తుల మెదడు ఆ క్షణంలో పనిచేయకపోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక మహిళకు సంబంధించిన మూర్ఛలను పరిశీలించిన సమయంలో ఒక న్యూరాలజిస్ట్ ఆమె మెదడులోని నిర్దిష్ట ప్రాంతాన్ని ప్రేరేపించడంవల్ల ఆమె వింతగా ప్రవర్తించినట్లు, ఆమె తన సొంత కదలికలను అనుకరిస్తున్నట్లు గుర్తించడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. అలాగే ది గాడ్ హెల్మెట్ గురించి మీరు వినే ఉంటారు. వాస్తవానికి దీనికి ‘కోరెన్ హెల్మెట్’ అని కూడా పేరు.ఈ డివైస్ మెదడును ఉత్తేజపరిచేందుకు అయస్కాంత సిగ్నల్స్‌ను ఉపయోగిస్తుంది. మతపరమైన, ఆధ్యాత్మిక భావనలను పరిశీలించడానికి రూపొందించబడింది. ఇది పారానార్మల్ అనుభవాలను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదించబడింది. పలు రిపోర్టుల ప్రకారం కొందరు వ్యక్తులు దీనిని ధరించినప్పుడు దేవుని దర్శనాలను అనుభవించినట్లు పేర్కొన్నారు. కానీ నిజం కాదు కదా.

ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ..

ఒత్తిడి వల్ల మహిళలు పలు పారానార్మల్ అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటారని ఒక అధ్యయనం కనుగొంది. బాధాకరమైన ఒత్తిడివల్ల ఏవో అతీత శక్తులు వెంటాడిన భ్రమ కూడా కలుగుతుంది. ఇవి విన్నవారు కూడా తమ ఆలోచనను అదనపు ఇంద్రియ అవగాహనకు అనుసంధానించడంవల్ల దెయ్యం ఉందనే భావనకు వస్తారు. ఈ సందర్భంలో కొందరికి ఘోస్ట్ శబ్దాలు వినిపించవచ్చు. భౌతిక, భావోద్వేగ ప్రతిస్పందనల మధ్య ఒత్తిడి ఎక్కువై ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటంది.

1920వ దశకంలో జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ ఒక కేస్ స్టడీని పబ్లిష్ చేసింది. దీని ప్రకారం ఒక జంట తమ నివాసంలో ఏదో అతీతశక్తి, దెయ్యం ఉన్నట్లు బలంగా నమ్మింది. ఎందుకంటే ఆ ఇంటిలో ఒక మూలకు రాత్రిళ్లు సడెన్‌గా మంట కనిపించి మాయమయ్యేదట. విషయం ఏంటంటే ఆ ఇంటిలోగల కొలిమి లేదా నిప్పుల పొయ్యిలో ఉద్భవించిన కార్బన్ మోనాక్సైడ్ లీక్ వల్ల అలా జరిగేదని తర్వాత పరిశోధనల్లో వెల్లడైంది. ఫైనల్‌గా ఏంటంటే బలమైన నమ్మకంలోంచి, కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల కూడా దెయ్యాలు ఉన్న భావనను కొందరు ఎదుర్కొంటారు. కానీ వాస్తవానికి దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉండవు.

Next Story