దోమకాటుతో కొత్తరకం జ్వరం.. దాని లక్షణాలివే.. ఇది డెంగ్యూ కంటే డేంజరా?

by Hamsa |
దోమకాటుతో కొత్తరకం జ్వరం.. దాని లక్షణాలివే.. ఇది డెంగ్యూ కంటే డేంజరా?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటివి వస్తాయనే భయం అందరిలో ఉంది. అకస్మాత్తుగా వర్షం పడుతుండటంతో.. ఇంటి చుట్టూ నీరు చేరి చెరువు మాదిరిగా మారిపోతుంది. అవి భూమి పీల్చుకోవడానికి కాస్త సమయం పట్టడంతో అంతలోపే అందులో దోమలు, ఈగలు చేరిపోతున్నాయి. దీంతో చిన్నారులు తెలియక ఆ నీరున్న చోట ఆడుతుండటంతో వ్యాధుల బారిన పడుతున్నారు. తాజాగా, ఓ కొత్తరకం జ్వరం బయటకు వచ్చింది.

ఇటలీ, దక్షిణ అమెరికాలో ‘ఓరోపౌచ్’ ఫీవర్‌ను వైద్యులు గుర్తించారని సమాచారం. అమెరికా, కరేబియన్‌లో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అతను పర్యటన నుంచి తిరిగి రావడంతో జ్వరం వచ్చింది. దీంతో అతను హస్పిటల్‌కు వెల్లగా వైద్యులు డౌట్ వచ్చి టెస్టులు చేయగా ఓరో పౌచ్ ఫీవర్ అని నిర్ధారణ చేశారు. అయితే ఈ జ్వరం దోమకాటు వల్లనే వచ్చిందని జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రజలకు ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీని లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉన్నాయట. ఈ జ్వరం లక్షణాలు నాలుగు నుంచి ఎనిమిది రోజుల మధ్య స్టార్ట్ అవుతాయని వైద్యులు వెల్లడించారు.

అయితే అవేంటంటే.. జ్వరం, తలనొప్పి, చలి, కీళ్లు బిగుసుకోవడం, కీళ్లలో నొప్పి, కొన్ని సార్లు వికారం, వాంతులు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఏడు రోజుల పాటు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇది డెంగ్యూ కంటే ప్రమాదం కాదని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ జాగ్రత్తగా ఉండటం మంచిదని అమెరికా, కరేబియన్ ప్రాంతాల ప్రజలకు సలహా ఇచ్చారు. అయితే ఈ జ్వరం వ్యాప్తి కారణాలు శాస్త్రవేత్తలు పర్యావరణ పరిస్థితులే అని అంచనా వేశారు. స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ.. దోమకాటుతో పాటు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావచ్చని అనుకుంటున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇందులోని విషయాలను ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.Next Story

Most Viewed