ఆ దేశంలో ఒక్క పాము కూడా కనిపించదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే

by Prasanna |
ఆ దేశంలో ఒక్క పాము కూడా కనిపించదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది పాము పేరు వినగానే భయపడి పారిపోతుంటారు. అంతే కాకుండా, చిన్న పిల్లలను తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడు పాము పేరు చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇవి ప్రమాదకరమైన జీవులు. మనుషులే కాకుండా, ఇతర జంతువులు కూడా వీటిని చూస్తే హడలిపోతాయి. ముఖ్యంగా, ఎలుకలను వేటాడే సమయంలోనే ఇవి ఎక్కువగా బయట కనిపిస్తాయి.

పాముల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా డేంజర్. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చెరువులలో కనిపిస్తూ ఉంటాయి. పాములను చూడగానే కొట్టడం, రాళ్ళు విసరడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే పగబట్టే అవకాశం ఉంది. పంట పొలాల్లో పాము కాటుకు వలన అనేక మంది మరణించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాములు ఉంటాయి. కానీ, పాములు లేని దేశం ఒకటి ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అసలు అక్కడ పాములు ఎందుకు లేవో ఇక్కడ తెలుసుకుందాం..

ఆ దేశం ఏదో కాదండి.. న్యూజిలాండ్‌.. ఎందుకంటే సముద్రం మధ్యలో న్యూజిలాండ్ ఉంది. ఆ సముద్రంలో కొన్ని చోట్ల దీవులు ఉన్నాయి. అక్కడ కొన్ని వేల పాములు ఉన్నాయి. ఇవి ఆ దీవుల నుంచి అక్కడికి చేరుకోవాలంటే చాలా కష్టం. ఎవరైనా తెలియకుండా పాములు తెచ్చి న్యూజిలాండ్‌లో పడేస్తే అప్పుడు ఏంటనే ప్రశ్న మీకు రావొచ్చు.. దానికి కూడా ఇక్కడ సమాధానం ఉంది. ఇక్కడి చట్ట ప్రకారం పాములను పెంచడం, ఇతర దేశాల ఉంచి తీసుకురావడం నిషేధం. అందువల్ల ఈ దేశంలోని జూపార్క్‌లలో ఒక్కపాము కూడా కనిపించదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story