- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జుట్టు అందం కోసం హెన్నాను రాస్తున్నారా.. వీటిని కచ్చితంగా కలపండి..
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది మహిళలు తమ జుట్టుకు రంగు వేయడానికి అలాగే వాటిని మరింత అందంగా, మెరిసేలా చేయడానికి హెన్నాను అప్లై చేస్తుంటారు. అయితే గోరింటాకు మిక్సింగ్ లో కొన్ని సహజసిద్ధమైన వస్తువులను కలిపితే దాని ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయని చాలామందికి తెలిసి ఉండదు.
హెన్నాతో కొన్ని వస్తువులను మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయడం ద్వారా, ఇది మీ జుట్టు రంగును మెరుగుపరచడమే కాకుండా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. షైన్, సుగంధ సువాసనను అందిస్తుంది. అంతే కాదు జుట్టును మరింత అందంగా తయారు చేస్తుంది. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
హెన్నాలో టీ లీఫ్ వాటర్ జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
టీ ఆకులలో ఉండే టానిన్ జుట్టు రంగును ముదురుగా చేసి జుట్టును మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఎరుపు లేదా గోధుమ రంగు జుట్టుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లు జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి వాటిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అందువల్లే మెహందీని అప్లై చేసేటప్పుడు సాధారణ నీటికి బదులుగా టీ లీఫ్ నీటిని వాడాలంటున్నారు నిపుణులు.
ఉసిరితో కలిపి హెన్నాను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో, వాటిని నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. హెన్నా, ఉసిరి వంటివి జుట్టుకు సహజ రంగును అందించడంలో సహాయపడతాయి. అలాగే మీకు జుట్టు రాలడం సమస్య ఉంటే, దానిని నయం చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
హెన్నాలో కుంకుడు కాయ కలిపి జుట్టుకు పట్టిస్తే ఏమవుతుంది ?
ఈ రోజుల్లో మాత్రమే కాదు శతాబ్దాలుగా, పొడవాటి అందమైన, బలమైన జుట్టు కోసం కుంకుడు కాయలను ఉపయోగిస్తున్నారు. మీరు మీ జుట్టును అందంగా ఉంచేందుకు హెన్నాలో కుంకుడుకాయ పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను శుభ్రంగా ఉంచుతాయి.
గుడ్డు అప్లై చేయడం..
గుడ్డు ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. కావాలంటే హెన్నా ద్రావణంలో 1 గుడ్డు మిక్స్ చేసి జుట్టుకు రాసుకోవచ్చు. లేకుంటే పెరుగులో కలిపి రాసుకుంటే లాభాలు వస్తాయి.
హెన్నాలో కరివేపాకు..
కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. మీరు మెహందీలో కరివేపాకును ఉపయోగించాలంటే ముందుగా దానిని పేస్ట్ చేయండి. ఇది మీ జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. దానికి పోషణనిస్తుంది. స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కావాలంటే కరివేపాకును హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.