వింటర్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయా?... కారణం ఇదే !

by Hamsa |
వింటర్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయా?... కారణం ఇదే !
X

దిశ, ఫీచర్స్: అదర్ సీజన్స్‌తో పోల్చితే డయాబెటిస్ రోగుల్లో చలికాలంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ కాలంలోనే వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లతో అనారోగ్యాలు సంభవిస్తుంటాయి. బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీనికితోడు రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడంతో ఇబ్బందులు పడుతుంటారు.

మిగిలిన సీజన్లకంటే వింటర్ సీజన్‌లో శరీరం పనితీరు కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ తగలకపోవడంవల్ల విటమిన్‌ డి లోపించి ఈ ఎఫెక్ట్ ఇన్సులిన్‌ హెచ్చు తగ్గుదలపై పడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరొక రీజన్ చాలామంది చలికి భయపడి వ్యాయామాలు మానేస్తుంటారు. మరి కొందరు తగిన సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, సరిపడా నీళ్లు తాగకపోవడం చేస్తుంటారు. ఇవి కూడా షుగర్ లెవల్స్ పెరగడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వింటర్ సీజన్‌లో షుగర్ పేషెంట్లు తగిన హెల్త్ ప్రొఫైల్, ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటెన్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed