మేనరికపు వివాహాలతో నష్టం.. పుట్టబోయే పిల్లల్లో కంటి జబ్బులు వస్తాయంటున్న నిపుణులు

by Dishafeatures2 |
మేనరికపు వివాహాలతో నష్టం.. పుట్టబోయే పిల్లల్లో కంటి జబ్బులు వస్తాయంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : మేనరికపు వివాహాలతో నష్టం జరుగుతుందని, పుట్టుబోయే పిల్లల్లో జన్యు లోపాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు చెప్తుంటారు. కానీ ఇప్పటికీ చాలామంది ఇదేదీ పట్టించుకోవడం లేదు. రక్త సంబంధీకులనో, ఆస్తులు బయటి వారికి చెంద కూడదనో.. ఇలా రకరకాల కారణాలతో మేన బావ, మేన కోడలు, మరదలు, మామ కూతురు అంటూ వరుసైన దగ్గరి సంబంధాలను ఎంచుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ దీనివల్ల కంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఈ జబ్బులు రావచ్చు

రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాల కారణంగా వంశపారంపర్య నేత్ర సమస్యలు ఉంటే గనుక, వారికి పుట్టబోయే పిల్లల్లోనూ రెటీనా, కార్నియా, మెల్లకన్ను, కంటి నరాలకు సంబంధించిన లోపాలు వంటి సమస్యలు వస్తాయి. దీంతోపాటు కళ్లల్లో మంట, బలహీనమైన చూపు, రేచీకటి, మసకగా కనబడటం వంటివి ప్రాబ్లమ్స్ కూడా మేనరికపు వివాహాలు చేసుకున్న జంటలకు పుట్టే పిల్లల్లో కనిపించే అవకాశాలు ఎక్కువ.

ముందు జాగ్రత్త ముఖ్యం

అలాగే కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంట్ ఇష్యూస్ రిస్క్ పెరుగుతుంది. అందుకే మేనరికపు సంబంధాలను అవైడ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తప్పని పరిస్థితిలో అప్పటికే రక్త సంబంధీకులతో వివాహమైన జంటలు ముందుగానే జన్యు సంబంధమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాలను నివారించే చికిత్సలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు.


Next Story

Most Viewed