Sugarcane Juice : స్వచ్ఛమైన పచ్చి చెరుకు రసంతో బోలెడన్నీ ప్రయోజనాలు..

by Anjali |   ( Updated:2023-05-29 12:17:01.0  )
Sugarcane Juice : స్వచ్ఛమైన పచ్చి చెరుకు రసంతో బోలెడన్నీ ప్రయోజనాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: వేళ ఎండవేడిమి తట్టుకోలేక జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు కొబ్బరి బొండాలు, నిమ్మరసం, చెరుకు రసం వంటివి తాగుతుంటారు. ఒక గ్లాస్ చెరుకు రసం తాగగానే ప్రాణం హాయిగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు సహజ నివారణగా పనిచేసే చెరుకు జ్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* చెరుకు రసం చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

* శరీర మృతకణాలను తొలగించి రంగును మెరుగుపరుస్తుంది.

* అలాగే జుట్టు సంరక్షణకు, చుండ్రును తగ్గించడానికి, హెయిర్ గ్రోతింగ్‌‌కు ఎంతగానో మేలు చేస్తుంది.

* వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. శరీరంలో ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది.

* చెరుకు జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల పొరలుగా ఉండే చర్మం, డల్‌‌నెస్, పాచెస్ వంటి స్కిన్ ప్రబ్లమ్స్ తగ్గిపోతాయి.

* ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు పింపుల్స్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కొనడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

* రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Read more :

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోందా? ఈ పండుతో చెక్ పెట్టండి!

Red Banana: ఎర్ర అరటి పండు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసా?

Advertisement

Next Story