- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ.. సలహాలిచ్చే పరికరం
సమయానికి భోజనం చేయడం, తగినంత నీళ్లు తాగడం వంటి రోజువారీ విషయాల్లో కొన్నిసార్లు నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక కొత్త డివైజ్ అందుబాటులోకి వచ్చింది.

దిశ, ఫీచర్స్ : ఉరుకులు, పరుగుల జీవితంలో తీరిక లేని సమయాలే అధికం. అలాంటప్పుడు వర్క్‌లో మునిగిపోయి మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీళ్లు తాగడం, అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం వంటి చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారమే లునా బ్యాండ్ (Luna Band). ది లునాజోన్ కంపెనీ అభివృద్ధి చేసిన వాయిస్-ఫస్ట్ వేరబుల్ డివైజ్ లునా బ్యాండ్. దీనిని చేతి మణికట్టు భాగంలో ధరిస్తే, శరీర స్థితిని నిరంతరం ట్రాక్ చేసి హాప్టిక్ వైబ్రేషన్ ద్వారా సూచనలు ఇస్తుంది.
లునా బ్యాండ్ సాధారణ ఫిట్‌నెస్ ట్రాకర్ల కంటే ముందుకు వెళ్లి, రోజంతా మీ శరీర స్థితిని గమనించి గంట గంటకు డైనమిక్ రొటీన్ ప్లాన్ చేసి ఇస్తుంది. ఇది స్క్రీన్‌లెస్ డిజైన్‌తో ఉంటుంది. సూచనలు చేతికి తగిలే వైబ్రేషన్ (హాప్టిక్ అలర్ట్స్) ద్వారా వస్తాయి. మాటల రూపంలో సలహాలు కావాలంటే ఎయిర్‌బడ్స్ లేదా ఫోన్ ద్వారా LifeOS AIతో మాట్లాడాలి. ఈ బ్యాండ్ LifeOS అనే శక్తివంతమైన AI ఇంజిన్‌తో పని చేస్తుంది. స్లీప్, రికవరీ, స్ట్రెస్, HRV వంటి రియల్-టైమ్ డేటా, అలాగే ఇతర హెల్త్ ఇన్‌పుట్స్‌ను విశ్లేషించి వ్యక్తిగత రోజువారీ ప్లాన్ తయారు చేస్తుంది. మీ స్థితి మారినప్పుడు ప్లాన్ కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. హై పెర్ఫార్మర్లు, అథ్లెట్లు, ఎనర్జీ-రికవరీని ఆప్టిమైజ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇన్వైట్-ఓన్లీ మొదటి డ్రాప్ కోసం వెయిట్‌లిస్ట్ తెరిచి ఉంది. అంటే రిజిస్టర్ చేసుకున్నవారికే సదరు కంపెనీ పంపిస్తుంది. అందరికీ అందుబాటులో లేదు. అయితే భవిష్యత్ హెల్త్ టెక్నాలజీలో ఇది మరో మైలురాయి అని చెప్పవచ్చు.






