వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలా?.. అయితే ఇవి పాటించండి

by Javid Pasha |
వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలా?.. అయితే ఇవి పాటించండి
X

దిశ, ఫీచర్స్ : అధిక బరువు తగ్గాలన్నా, ఉన్న బరువు మరింత పెరగకుండా ఉండాలన్నా వ్యాయామాలు తప్పనిసరి. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి ఎక్సర్‌సైజ్ చేసే సమయం ఉండదు. అలాంటప్పుడు బరువు తగ్గడం ఎలా అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తుంటారు. కాగా అలాంటివారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* నిజానికి వ్యాయామం చేయడం లేదా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కలిగి ఉండటం మంచిది. ఒకవేళ అలా వీలు కానప్పుడు ఫిట్‌గా, హెల్తీగా ఉండటానికి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఇక ఆహారాల విషయానికి వస్తే బరువు తగ్గాలనుకునేవారు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అస్సలు తినకూడదు. వీటికి బదులు పండ్లు, తాజా కూరగాయలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే తృణ ధాన్యాలు, ఇతర ఆహారాలు తీసుకోవాలి.

* ఎక్కువ స్ట్రెస్‌కు గురికావడం కూడా అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల ఈటింగ్ డిజార్డర్ పెరిగి, బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడి, యాంగ్జైటీలకు గురి అయ్యే పరిస్థితులకు దూరంగా ఉండాలి.

* చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఇవి కూడా అధిక బరువును ప్రేరేపిస్తాయి. అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, ప్రాసెస్ చేసిన వివిధ ఆహారాలు కూడా ఒబేసిటీకి కారణం అవుతాయి. వీటికి బదులు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి తినడంవల్ల బరువు పెరగకుండా ఉంటారు. కొంతమందికి తరచుగా స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. కానీ ఇవి చాలా ఫాస్ట్‌గా అధిక బరువు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం బెటర్.

* నోట్ : పైసమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed