మీరు వాడుతున్న డియోడరెంట్స్ ప్రాణాంతకం.. ?

by Disha Web Desk 17 |
మీరు వాడుతున్న డియోడరెంట్స్ ప్రాణాంతకం.. ?
X

దిశ, ఫీచర్స్: చర్మ సంరక్షణ, వస్త్రధారణ ఉత్పత్తులను కలిగి ఉన్న వెల్‌నెస్ ఇండస్ట్రీ భారీగా అభివృద్ధి చెందింది. గుడ్ స్కిన్ కోసం క్రీమ్స్, సీరమ్స్ నుంచి డియోడరెంట్స్, పెర్ఫ్యూమ్స్ వరకు అమేజింగ్ ప్రొడక్ట్స్‌ను అందిస్తోంది. అయితే వీటి వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యూకేకు చెందిన14 ఏళ్ల బాలిక ఏరోసోల్ డియోడరెంట్‌ను పీల్చడం వల్ల కార్డియాక్ అరెస్ట్‌తో మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

డియోడరెంట్‌లలో ఉపయోగించే రసాయనాలు బ్రాండ్ టు బ్రాండ్‌ మారుతూ ఉంటాయి. అయితే కమర్షియల్ డియోడరెంట్‌లను వినియోగించడం వల్ల కలిగే ప్రమాదాలు తక్షణమే కనిపించవు కానీ దీర్ఘకాలికంగా వాడితే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అరుదైన సంఘటనల్లో ప్రాణాంతకం అవుతాయని హెచ్చరిస్తున్నారు. డియోడరెంట్స్ ఎక్కువ సేపు పీల్చుకున్నట్లయితే వాటిలో ఉండే పదార్థాలు కడుపు, పేగులను ఇరిటేట్ చేసి వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు.


దగ్గు, ఇతర శ్వాసకోశ లక్షణాలను కలిగించవచ్చు. ఆస్తమాతో బాధపడే రోగుల్లో ఆస్తమా ఎటాక్‌ను ప్రేరేపించి, ప్రాణాంతకమవుతుంది. క్లోజ్డ్ సర్ఫేస్‌లో ఇది మరింత ప్రమాదకరం. కొన్నిసార్లు డియోడరెంట్ క్యారియర్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండదు. ఇది ARDS (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) అనే ప్రమాదకరమైన శ్వాసకోశ దృగ్విషయానికి దారితీస్తుంది. అలెర్జీ ఉన్నవారు స్ట్రాంగ్ డియోడరెంట్‌కు ఒక్కసారి ఎక్స్‌పోజ్ అయినా ప్రాణాంతకమే.


'దయ'తో ఆందోళన, డిప్రెషన్‌ దూరం



Next Story

Most Viewed