నా మరణం నా చేతుల్లో.. ఎంత మంది ఏడ్చారు?

by Disha Web Desk 17 |
నా మరణం నా చేతుల్లో.. ఎంత మంది ఏడ్చారు?
X

దిశ, ఫీచర్స్: సరదా, ఉత్సుకత ద్వారా కొందరు పైశాచిక ఆనందాన్ని పొందుతారు. కానీ ఈ అత్యుత్సాహమే ఇతరుల ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది. ఆగ్రహానికి గురిచేస్తుంది.

ఓ బ్రెజిలియన్ వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. తను చనిపోతే అంత్యక్రియలకు ఎంత మంది వస్తారో చూడాలనుకున్న ఈ 60 ఏళ్ల ఈవెంట్ ప్లానర్.. ఇందుకోసం ఆస్పత్రిలో చేరి చనిపోయినట్లు, ఫ్యునెరల్స్ ఫలానా ప్లేస్‌లో జరుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సమీప బంధువులు, స్నేహితులకు స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు.

ఈవెంట్స్ నిర్వహణలో అనుభవజ్ఞుడైన బ్రెజిల్‌కు చెందిన బల్తాజర్ తన చేతుల మీదుగా వందలకొద్దీ అంత్యక్రియలు నిర్వహించాడు. తాను నిర్వహించే సెర్మనీస్‌కు కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురే వచ్చేవారు. మరికొన్ని సార్లు వందలు, వేల సంఖ్యలో అటెండ్ అయ్యేవారు. ఈ క్రమంలోనే తాను చనిపోతే తనను చూడటానికి, నివాళులు అర్పించడానికి ఎంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అవుతారో, వారెలా ఏడుస్తారో, ఏ విధంగా వీడ్కోలు చెప్తారో చూడాలనుకున్నాడు. అందుకోసం తాను చనిపోయినట్లు తన ఫ్రెండ్స్‌ను, ఫ్యామిలీ మెంబర్స్‌ను నమ్మించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి, వేరొకరు దానిని షేర్ చేస్తున్నట్టు తన ఫేస్‌బుక్‌ సోషల్ మీడియా గ్రూపులో పోస్టు చేశాడు.

జనవరి 10, బల్తాజర్ మెంబర్‌గా ఉన్న సోషల్ మీడియాలో ఎవరో ఒక మెసేజ్‌ను పోస్టును షేర్ చేశారు. అందులో ఈ విధంగా ఉంది. 'ఈరోజు మీతో ఒక విషాదకర వార్తను పంచుకుంటున్నా. అదేమిటంటే బల్తాజర్ మనల్ని వదిలి వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది' అని పోస్ట్ చేశారు. అంతకుముందు రోజు బల్తాజర్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టు ఒక ఫొటో కూడా అటాచ్ చేశారు. ఇది చూసిన వారందరూ బల్తాజర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో చనిపోయినట్టు అనుకున్నారు. మరో వైపు 'బల్తాజర్ తమకు తెలియకుండా ఆస్పత్రిలో ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు. ఏం జరిగింది?' అని కుటుంబ సభ్యులు కూడా గాబరా పడిపోయారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రికి వెళ్లి అడిగితే.. అలాంటి వారిక్కడ చేరలేదనే సమాచారాన్ని తెలుసుకుంటారు.

ఇక మరోవైపు సోషల్ మీడియాలో బల్తాజర్ ఫ్రెండ్స్ అప్పటికే అతను చనిపోయిన విషాద వార్తను షేర్ చేయడం.. నివాళులర్పించడం, అతని గురించి చర్చించడం, మరణానికి గల కారణాలను ఆరా తీయడం ప్రారంభించారు. కానీ అతను ఎలా చనిపోయాడనే సందేహం గురించి ఎంత మంది కామెంట్స్ చేసిన ఎటువంటి రిప్లై అందలేదు. కానీ అతని ఫేస్ బుక్‌లో మరో మెసేజ్ మాత్రం ప్రత్యక్షమైంది. అదేమిటంటే 'జనవరి 18న బల్తాజర్ లెమోస్ అంత్యక్రియలు అతని స్వస్థలమైన కురిటిబాలోని చిన్న ప్రార్థనా మందిరంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు అందరూ అక్కడికి చేరుకుంటున్నారు' అనేది ఆ సందేశం సారాంశం.

బల్తాజర్ తన జీవితం గురించి వివరించిన వాయిస్ రికార్డ్ ఒకటి కూడా సోషల్ మీడియాలో ఉంది. అయితే అది బల్తాజర్ బతికున్నప్పటి వాయిస్ రికార్డ్ అని అతని ఫ్రెండ్స్ భావించారు. కొందరు మరణించిన అతని వాయిస్‌ను విని ఏడ్వడం స్టార్ట్ చేశారు. ఇక ఒక్కొక్కరుగా అంత్యక్రియలకు హాజరవడం ప్రారంభించారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారు? ఎలా ఏడుస్తారు? అనేది చూడాలనుకున్న బల్తాజర్ అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. వెంటనే అంత్యక్రియల సన్నివేశాన్ని చూసేందుకు అక్కడికి సడెన్‌గా వచ్చాడు. దీంతో అతన్ని చూడగానే కొందరికి నోట మాట రాలేదు. మరి కొందరు ఇంకా గట్టిగా ఏడ్వసాగారు. కానీ బల్తాజర్ అసలు విషయాన్ని వివరించే సరికి అందరూ షాక్ అయ్యారు. అదే సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు చనిపోయినట్లు నటించి అందరినీ ఫూల్ చేసిన అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే బల్తాజర్‌కు 80 ఏండ్ల వయస్సుగల తల్లి ఉంది. ఆమె వీల్ చైర్‌కే పరిమితమై ఉంది. ఈ వార్త ఆమె చెవిన పడితే.. ఒక వేళ హార్ట్ ఎటాక్ వస్తే రెస్పాన్స్ అతనే కదా అని తిట్టిపోశారు.

అయితే 'నేను నిజంగా ప్రజలను ఫూల్ చేయాలనుకోలేదు. ఎవరినీ బాధ పెట్టాలని, కించపరచాలని అస్సలు అనుకోలేదు. కానీ నా మరణం తర్వాత బంధువులు, స్నేహితులు ఎలా రియాక్ట్ అవుతారోనని మాత్రమే తెలుసుకోవాలని అనుకున్న. అందుకే అలా చేశా. ఐదు నెలల క్రితం నాకు ఈ ఐడియా వచ్చింది. చాలామంది బాధపడ్డారని తెలుసుకున్నాను. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నా' అని తెలిపాడు.

Next Story

Most Viewed