చియా సీడ్స్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం !

by Disha Web Desk |
చియా సీడ్స్  వల్ల  ఉపయోగాలేంటో తెలుసుకుందాం !
X

దిశ,వెబ్ డెస్క్ : చియా గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటం కోసం రక రకాల పద్దతులను ఎంచుకుంటున్నారు. వాటిలో చియా సీడ్స్ ముందంజలో ఉన్నాయి. చియా గింజలను రోజు తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా అవ్వడమే కాకుండా, మెరిసేలా చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది.

చియా సీడ్స్ లో విటమిన్ సి , విటమిన్ ఎ ఉండటం వల్ల , ఇది చర్మాన్ని కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. చర్మం పై ముడతలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది.

వీటిని ఎలా తీసుకోవాలంటే !

ఈ గింజలను తీసుకొని సుమారు 5 గంటల పాటు నాన బెట్టుకొని , తరువాత వీటిని శుభ్రం చేసుకొని మిక్సీ లో మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో తేనే కొంచం కలుపుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 4 లేక 5 నిముషాల పాటు ఉంచుకొని , చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.ఇలా చేయడం వల్ల మీ చర్మం కొన్ని రోజులకు కాంతివంతంగా మారుతుంది.

Next Story