పెరుగులో ఇది క‌లిపి రాస్తే చాలు.. ముఖం అందంగా మారుతుంది!

by Disha Web Desk 10 |
పెరుగులో ఇది క‌లిపి రాస్తే చాలు.. ముఖం అందంగా మారుతుంది!
X

దిశ,వెబ్ డెస్క్: మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటాము. పెరుగు మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఎందుకంటే దీనిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇది శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌పడుతుంది. పెరుగు మ‌న ఆరోగ్యాన్నే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా మెరుగుప‌ర‌స్తుంది. పెరుగును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖం అందంగా కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగును తీసుకొని.. త‌రువాత దీనిలో ఒక టీ స్పూన్ గోధుమ‌పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చేత్తో కానీ, బ్ర‌ష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఎండ వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ కూడా తొల‌గిపోతుంది. చ‌ర్మంపై ఉండే ముడతలు పోయి ముఖం అందంగా మారుతుంది. ఈ చిట్కాను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

Read More..

జాజికాయ‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది!

Next Story