20 ఏండ్లుగా చెప్పుల్లేకుండానే తిరుగుతున్న జోసెఫ్.. కారణం అదేనట!

by Disha Web Desk 10 |
20 ఏండ్లుగా చెప్పుల్లేకుండానే తిరుగుతున్న జోసెఫ్.. కారణం అదేనట!
X

దిశ, ఫీచర్స్ : కనెక్టికట్‌లోని నార్వాక్‌కు చెందిన జోసెఫ్ డెరువో జూనియర్(Joseph DeRuvo Jr) 20 ఏండ్లుగా చెప్పుల్లేకుండా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. రెండు దశాబ్దాల క్రితం అతని పాదాలకు బాధాకరమైన బొటన వ్రేలికలు(జట్టలు)రావడంతో చెప్పులు వేసుకోవడం వదులుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడు. అయితే 59 ఏళ్ల జోసెఫ్‌కు చెప్పులు వేసుకోవద్దని నిర్ణయించుకున్న తేదీ, సంవత్సరం కరెక్టుగా గుర్తులేవట కానీ మొదటి యాపిల్ ఐఫోన్ (2002) మార్కెట్లోకి రావడానికి దాదాపు ఐదేళ్ల ముందు నుంచి తాను చెప్పులు వేసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.

రెండు దశాబ్దాల క్రితం టైట్‌గా ఉన్న షూస్‌ వేసుకొని జాగింగ్‌కు వెళ్లినప్పుడు జోసెఫ్ డెరువో రెండు కాళ్లకు వెళ్ల చివరి భాగాన పుండులాగా మారి, నొప్పి కలిగిందట. డాక్టర్‌ను సంప్రదించగా ఉపశమనానికి సర్జరీ చేయాలని సిఫార్సు చేశాడు. కానీ ఈ మాజీ ఫొటో గ్రాఫర్ మాత్రం అందుకు ముందు నొప్పి తీవ్రంగా ఉండటంవల్ల చెప్పులు వేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సర్జరీ చేయించుకుందామని ఆలోచించినప్పుడు డెరువో జూనియర్ తన పాదాలకు చొప్పించాల్సిన స్క్రూలలో తనకు అలెర్జీ కలిగించే లోహం(metal) ఉందని తెలుసుకున్నాడు. దానివల్ల కలిగే ఇబ్బందికంటే, చెప్పులు ధరించకుండా ఉన్నప్పుడు కలిగే ఉపశమనమే తనకు మేలు చేస్తుందని భావించిన డెవో చెప్పులు లేని లైఫ్ స్టైల్‌ను కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు.

అంత ఈజీ కాకపోయినా..

చెప్పుల్లేకుండా ఉండటమనేది కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపించినా జాగ్రత్తలు తీసుకోవడంవల్ల ఇబ్బంది ఉండదని జోసెఫ్ పేర్కొన్నాడు. యూఎస్‌లోని కనెక్టికట్‌లో చెప్పుల్లేకుండా ఉండటమనేది అనుకున్నంత ఈజీ కాదు. మనం చెప్పుల్లేకుండా పుట్టవచ్చు కానీ యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న ప్రతీ ఒక్కరు చెప్పులు ధరించి బయటకు వెళ్లడాన్ని గౌరవ ప్రదంగా భావిస్తారు. ఈ కారణంగానే జోసెఫ్ డెరువో జూనియర్ బయటి వ్యక్తుల నుంచే కాకుండా స్వయానా తన భార్య నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అరుదుగా ఎప్పుడైనా ఫ్రెండ్స్ లేదా, ఫ్యామిలీతో రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ చెప్పులు లేనిదే లోపలికి అనుమతించరు కాబట్టి మరీ వదులుగా ఉన్న చెప్పులను జస్ట్ కొద్దిసేపటికోసం వేసుకుంటాడట జోసెఫ్. అందకే తన కారులో ఎప్పుడూ చాలా వదులుగా ఉండే ఒక జత చెప్పులు ఉంచుకుంటానని చెప్తున్నాడు. ఎప్పుడో ఒకసారి తప్పనిసరి పరిస్థితిలో తప్ప ఎన్నడూ వాటిని వాడనని వెల్లడించాడు జోసెఫ్. చెప్పులులేని లైఫ్ స్టైల్ తనకు ఎటువంటి ఇబ్బందిని కలిగించకపోగా, రిలాక్స్‌గా ఉంటుందని చెప్తున్నాడు.

కడ్డకట్టిన మంచులో కూడా..

తీవ్రమైన వేడి వాతావరణం ఉండే వేసవిలోను, మంచు గడ్డకట్టే శీతాకాలంలోను షూస్ లేకుండానే ఎక్కడికైనా తన ప్రయాణం సాఫీగా కొనసాగిస్తుంటాడు జోసెఫ్. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటికంటే కూడా చెప్పులు లేకుండా నడిచే అలవాటే తనకు మేలు చేస్తుందని, అందుకే తన నిర్ణయం మార్చుకోనని అంటున్నాడు జోసెఫ్ డెరువో జూనియర్. ప్రపంచంలో చెప్పులు లేకుండా నడిచే ఏకైక వ్యక్తి జోసెఫ్ ఒక్కడే కానప్పటికీ సుదీర్ఘకాలంపాటు అన్ని సందర్భాల్లోనూ చెప్పుల్లేకుండా తిరిగే ఏకైక వ్యక్తి మాత్రం ఇతనే.


Next Story