యూవీ రేస్‌తో టాటూస్.. ఈ భయానక టాటూలను మీరూ చూడండి!!

by sudharani |
యూవీ రేస్‌తో టాటూస్.. ఈ భయానక టాటూలను మీరూ చూడండి!!
X

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ యూత్ టాటూ వేయించుకోవడాన్ని ఫ్యాషన్‌గా భావిస్తుంటారు. అమ్మానాన్న అప్యాయతకు చిహ్నంగానో, ప్రేమకు గుర్తుగానో, స్నేహానికి మధుర జ్ఞాపకంగానో టాటూ వేయించుకుంటుంటారు. మరోవైపు కొందరు లిమిట్స్ మరిచిపోయి శరీరం మొత్తం టాటూ వేయించుకున్న సందర్భాలను చూశాం. టాటూలపై ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారికోసం తాజాగా 'UV Tattoos' ను ఇంట్రడ్యూజ్ చేశాడు యూకేకు చెందిన జానీ హాల్. బ్లాక్ అండ్ గ్రే రియలిజం శైలి రూపకల్పనలో యూవీ రియాక్టివ్ ఇంక్‌ను పరిచయం చేసిన మొట్టమొదటి టాటూ ఆర్టిస్టుగా ప్రసిద్ధి చెందాడు.

జానీ హాల్ టాటూలు నలుపు, బూడిద రంగులతో కూడి వాటి మధ్యలో లైటింగ్ వెలుతురులో అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఆల్ర్టా వాయిలెట్, బ్లాక్ కలర్ షైనింగ్ బల్బ్ కింద ఉన్న డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేటివ్ ఇంక్‌ను ఉపయోగించిన ఆయన.. యూవిలిజం అనే పదాన్ని కూడా పరిచయం చేశాడు. 3 ఏండ్ల వయస్సులోనే టాటూ ఆర్టిస్టుగా నిరూపించుకోవాలనే పట్టుదలతో అతను యూకేని విడిచిపెట్టి ఆస్ట్రేలియా వచ్చాడు. తర్వాత ఇక్కడే స్థిరపడ్డాడు. 2015లో ఆస్ట్రేలియాలో టాటూ ఆర్టిస్ట్‌గా ఒకరి వద్ద పనిచేశాడు.

ఆ క్రమంలో ఆర్టిస్టుగా ఎదిగిన హాల్ నలుపు, బూడిద రంగులకు సంబంధించిన టాటూలకు ఆకర్షితుడయ్యాడు. క్లాసిక్ అండ్ యూవీ టాటూల కలయిక కోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు. అయితే కొంతమంది జానీ హాల్ టాటూల్లో పెద్ద ప్రత్యేకత ఏముందని కూడా విమర్శించిన సందర్భాలున్నాయి. అతని కళను ఒక జిమ్మిక్కుగా వర్ణించారు. అతను సింపుల్‌గా క్రాఫ్ట్ స్టయిల్ ను అనుసరించాడని చెప్తుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే జానీ హాల్ యూవీ రియాక్టివ్ ఇంక్ ను యూజ్ చేసిన మొట్టమొదటి కళాకారుడు కాకపోవచ్చునేమో కానీ, అతను గొప్ప ప్రసిద్ధి చెందిన సరికొత్త టాటూ కళాకారుడు అనేది మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి : ముఖంపై తెల్లటి మొటిమలా? అయితే అవి మిలియా కురుపులు కావచ్చు !

Next Story

Most Viewed